IND W vs SA W FINAL: ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ క్యాన్సిల్.. మళ్లీ ఎప్పుడంటే?

ICC మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుండగ.. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేయనున్నారు.

New Update
IND W vs SA W FINAL

IND W vs SA W FINAL

ICC మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్(IND W vs SA W FINAL MATCH) ఇవాళ జరగనుంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో జరుగుతుంది. ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభం కానుండగ.. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేయనున్నారు. రెండు జట్లు తమ మొదటి ప్రపంచ కప్ టైటిల్‌ను గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ ఈ అద్భుతమైన మ్యాచ్‌పై వర్షం ముప్పు పొంచి ఉంది. ఆల్రెడీ ముంబైలో వర్షం పడుతుంది. దీని కారణంగా టాస్ వేయడం లేట్ అవుతుంది.

Also Read :  IND Vs AUS: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ ముందు టార్గెట్ ఎంతంటే?

IND W vs SA W FINAL

నవీ ముంబైలో జరిగిన గత కొన్ని ప్రపంచ కప్ మ్యాచ్‌లకు వర్షం అంతరాయం కలిగించింది. గతంలో బంగ్లాదేశ్‌తో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్‌లో ఆట కొద్దిసేపు ఆగిపోయింది. ఇప్పుడు ఫైనల్ మ్యాచ్‌ను కూడా వర్షం చెడగొడుతుందేమో అని అభిమానులు కంగారు పడుతున్నారు. అందువల్ల మ్యాచ్‌కు ముందు నవీ ముంబైలో వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం.

గత కొన్ని రోజులుగా నవీ ముంబైలో నిరంతరం వర్షాలు కురుస్తున్నాయి. మహిళల ప్రపంచ కప్ ఫైనల్ సమయంలో కూడా భారీ వర్షం పడే అవకాశం ఉంది. అక్యూవెదర్ ప్రకారం.. నవంబర్ 2 ఆదివారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నవీ ముంబైలో వర్షం పడే అవకాశం 15 శాతం ఉంది. మ్యాచ్ ప్రారంభమయ్యే సమయానికి అంటే మధ్యాహ్నం 3 గంటలకు వర్షం పడే అవకాశం 20 శాతానికి పెరగవచ్చు.

అది కాస్త సాయంత్రం 4 గంటల ప్రాంతంలో వర్షం పడే అవకాశం 49 శాతం, సాయంత్రం 6 గంటల ప్రాంతంలో 58 శాతం పెరుగుతుంది. సాయంత్రం 5 నుండి 6 గంటల మధ్య వర్షం పడే అవకాశం 51 శాతం కూడా ఉంది. అలాంటి సందర్భంలో వర్షం ఆటకు అంతరాయం కలిగించి మ్యాచ్‌ను నిలిపివేసే అవకాశం ఉంది. ఒకవేళ స్వల్పంగా వర్షం కురిసినా ఓవర్ కౌంట్ తగ్గే అవకాశం ఉంది. అయితే సాయంత్రం 7 గంటల తర్వాత వాతావరణం క్లియర్ అవుతుందని, రోజంతా వర్షం పడే అవకాశం 20% మాత్రమే అని అక్యూవెదర్ తెలిపింది.

Also Read :  ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. విన్నర్‌కు ICC, BCCI కోట్లలో ప్రైజ్‌మనీ..!

మ్యాచ్ రద్దు అవుతుందా?

ఈరోజు ఫైనల్ వర్షం కారణంగా రద్దు అయితే ఏమి జరుగుతుందో అని అభిమానులు కంగారు పడుతున్నారు. కాబట్టి ఈరోజు ఫైనల్ వర్షం కారణంగా పూర్తి కాకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నాకౌట్ మ్యాచ్‌లకు ఐసిసి రిజర్వ్ డేను కేటాయించింది. అందువల్ల ఈరోజు మ్యాచ్ పూర్తి కాకపోతే, నవంబర్ 3న ఫైనల్ జరుగుతుంది. అయితే వర్షం పడకూడదని, ఈరోజు మ్యాచ్ ఎటువంటి అంతరాయం లేకుండా ముగియాలని అభిమానులు కోరుకుంటున్నారు. 

Advertisment
తాజా కథనాలు