IND Vs AUS: ఆస్ట్రేలియా భారీ స్కోర్.. భారత్ ముందు టార్గెట్ ఎంతంటే?

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 సిరీస్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. హోబర్ట్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.

New Update
IND Vs AUS 3rd T20 Series

IND Vs AUS 3rd T20 Series

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 సిరీస్(ind-vs-aus-t20-match) అత్యంత రసవత్తరంగా సాగుతోంది. హోబర్ట్‌ వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. మొదటగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్దేశించిన 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది. దీంతో భారత్ ముందు 187 టార్గెట్ ఉంది. ఈ తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటర్లు చెలరేగిపోయారు. ఫోర్లు, సిక్సర్లతో ఇరక్కుమ్మేశారు. 

Also Read :  IND W vs SA W FINAL: ఉమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ క్యాన్సిల్.. మళ్లీ ఎప్పుడంటే?

IND Vs AUS

ముందుగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. దీంతో ఆసీస్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్‌ క్రీజ్ లోకి వచ్చారు. మొదటి నుంచో దూకుడు ప్రదర్శించారు. కానీ ఎక్కువ సమయం క్రీజ్‌లో నిలబడలేకపోయారు. ట్రావిస్ హెడ్ 4 బంతుల్లో 6 పరుగులు చేసి ఔటయ్యాడు. 

కెప్టెన్ మిచెల్ మార్ష్ కూడా ఈ మ్యాచ్‌లో పెద్దగా రాణించలేకపోయాడు. 14 బంతుల్లో కేవలం 11 పరుగులు మాత్రమే చేశాడు. అలాగే వికెట్ కీపర్ ఇంగ్లిష్ సైతం చేతులెత్తేశాడు. అతడు 7 బంతులు ఆడి ఒక్క పరుగు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. 

Also Read :  ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్.. విన్నర్‌కు ICC, BCCI కోట్లలో ప్రైజ్‌మనీ..!

కానీ టిమ్ డేవిడ్ మాత్రం భారత బౌలర్లకు చుక్కలు చూపించాడు. స్టేడియంలో సిక్సర్ల మోత మోగించాడు. అతడు కేవలం 38 బంతుల్లోనే 74 పరుగులు సాధించాడు. అతడికి తోడు స్టోయినీస్ కూడా భారీ స్కోర్ చేశాడు. స్టోయినీస్ 39 బంతుల్లో 64 పరుగులు సాధించాడు. ఇలా టిమ్ డేవిడ్, స్టోయినీస్ కలిపి ఆసీస్‌కు మంచి స్కోర్ రాబట్టారు. ఇక భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు, వరుణ్ చక్రవర్తి 2, దూబే ఒక్క వికెట్ తీశారు. 

Advertisment
తాజా కథనాలు