/rtv/media/media_files/2025/11/02/icc-odi-world-cup-2025-final-icc-prize-money-bcci-prize-money-2025-11-02-12-38-42.jpg)
ICC ODI World Cup 2025 final ICC PRIZE MONEY BCCI PRIZE MONEY
ఏడుసార్లు ఛాంపియన్స్ అయిన ఆస్ట్రేలియాను సెమీఫైనల్లో ఓడించి భారత మహిళా క్రికెట్ జట్టు ICC ODI ప్రపంచ కప్ 2025 ఫైనల్‌కు చేరుకుంది. ఇవాళ (నవంబర్ 2, ఆదివారం) జరిగే ఫైనల్‌లో భారత జట్టు దక్షిణాఫ్రికాతో (IND W Vs SA W) తలపడనుంది.
తొలిసారిగా ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకునేందుకు ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ఈ క్రమంలో ఈ మెగా టోర్నీలో గెలిపొందిన జట్టుకు దక్కే భారీ ప్రైజ్‌మనీ ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.
ICC PRIZE MONEY
ఐసీసీ ఈ సారి ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ ట్రోఫీకి రికార్డు స్థాయిలో ప్రైజ్ మనీ ప్రకటించింది. పురుషుల టోర్నీకి సమానంగా.. తొలిసారిగా మహిళల టోర్నీకి ప్రైజ్‌మనీని వెల్లడించింది. అంటే.. మహిళా క్రికెటర్లకు పురుషులతో సమాన గౌరవం, గుర్తింపు కల్పించారు.
అందిన సమాచారం ప్రకారం.. 2025 ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ టోర్నీకి ఐసీసీ మొత్తం రూ.122 కోట్లు కేటాయించినట్లు సమాచారం. అందులో ఈ ఫైనల్ మ్యాచ్‌లో గెలుపొందిన జట్టుకు సుమారు రూ.40 కోట్లు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో రన్నరప్ జట్టుకు రూ.20 కోట్లు అందివ్వనున్నట్లు సమాచారం.
BCCI PRIZE MONEY
ఇక ఈ ఫైనల్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీం ఇండియా దక్షిణాఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచినట్లయితే BCCI భారీ నజరానా ప్రకటించింది. ఒకవేళ భారత్ ఈ ప్రపంచ కప్ గెలిస్తే.. మహిళా జట్టుకు BCCI కోట్ల విలువైన బహుమతిని అందించే అవకాశం ఉంది.
బీసీసీఐ కూడా గత సంవత్సరం T20 ప్రపంచ కప్ గెలిచిన టీమిండియా పురుషుల జట్టు అందుకున్న అదే ప్రైజ్ మనీని మహిళా జట్టుకు ఇవ్వనుంది. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీమిండియాకు బీసీసీఐ దాదాపు రూ.125 కోట్ల భారీ ప్రైజ్ మనీ అందించింది.
ఇప్పుడు అదే తరహాలో భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలిస్తే పూర్తి రూ.125 కోట్ల ప్రైజ్ మనీని అందుకోనుంది. దీనిబట్టి చూస్తే భారత మహిళా క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ టోర్నీ గెలిస్తే.. ఐసీసీ నుంచి రూ.40 కోట్లు, బీసీసీఐ నుంచి రూ.125 కోట్లు రివార్డుగా దక్కే ఛాన్స్ ఉంది.
Follow Us