/rtv/media/media_files/2025/11/01/ind-w-vs-sa-w-2025-11-01-16-25-15.jpg)
IND W vs SA W
ICC ఉమెన్స్ ODI వరల్డ్ కప్ 2025 (ICC Womens ODI World Cup 2025) టోర్నమెంట్ ఆఖరి దశకు చేరుకుంది. ఇవాళ (నవంబర్ 2) IND Vs SA (భారత్, సౌతాఫ్రికా) జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ (IND W vs SA W FINAL MATCH) జరగనుంది. ఇరు జట్లు నవీ ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో తలపడనున్నాయి. ఇటీవల సౌతాఫ్రికా జట్టు ఇంగ్లాండ్‌ను సెమీ ఫైనల్‌లో ఓడించి ఫైనల్‌కు చేరుకోగా.. భారత్ జట్టు ఆస్ట్రేలియాను ఓడించి ఫైనల్‌కు చోటు దక్కించుకుంది.
దీంతో ఇప్పుడు రెండు జట్లు ట్రోఫీని సాధించే లక్ష్యాన్ని పెట్టుకున్నాయి. ఈ మ్యాచ్ చాలా ఉత్కంఠభరితంగా, ఆసక్తికరంగా ఉంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. అందువల్ల ఈ ఫైనల్ మ్యాచ్ కోసం ఎంతో మంది ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ మ్యాచ్‌ను ఎక్కడ ఫ్రీగా చూడొచ్చు అని క్రికెట్ ఫ్యాన్స్ తెగ వెతికేస్తున్నారు. ఇప్పుడు ఈ ఫైనల్ మ్యాచ్ ఎప్పుడు, ఎక్కడ, ఏ టైం, ఎందులో ఉచితంగా చూడోచ్చో పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Also Read : బాబర్ ఆజామ్ సంచలనం: రోహిత్ శర్మ ప్రపంచ రికార్డు బద్దలు
DD స్పోర్ట్స్‌లో ఫ్రీగా
భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగే మహిళల ODI ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ నవీ ముంబైలోని DY పాటిల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:00 గంటలకు ప్రారంభమవుతుంది. టాస్ వేయడానికి అరగంట ముందు.. మధ్యాహ్నం 2:30 గంటలకు.. రెండు జట్ల కెప్టెన్లు మైదానంలోకి దిగుతారు. భారతదేశంలో ఫైనల్ మ్యాచ్ వివిధ స్టార్ స్పోర్ట్స్ ఛానెళ్లలో లైవ్ ఉంటుంది. క్రికెట్ ఫ్యాన్స్ DD స్పోర్ట్స్‌లో ఈ ఫైనల్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడొచ్చు.
ఫ్రీగా JioHotstarలో
అంతేకాకుండా క్రికెట్ అభిమానులు తమ మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లలో కూడా JioHotstar యాప్, వెబ్‌సైట్ ద్వారా ఇండియా-దక్షిణాఫ్రికా మహిళల ప్రపంచ కప్ 2025 ఫైనల్ లైవ్ స్ట్రీమింగ్‌ను ఉచితంగా చూడవచ్చు. దీని కోసం ఒక్క పైసా కూడా ఖర్చు చేయనవసరం లేదు. భారత జట్టు ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకోవడం ఇది మూడోసారి కావడం గమనార్హం. గతంలో టీమ్ ఇండియా 2005, 2017లో ప్రపంచ కప్ ఫైనల్‌కు చేరుకుంది. కానీ టైటిల్‌ను గెలుచుకోలేకపోయింది.
Also Read : భారత మాజీ స్టార్ క్రీడాకారుడు కన్నుమూత..
IND W vs SA W: రెండు జట్ల జట్లు
భారత్ - హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, హర్లీన్ డియోల్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, దీప్తి శర్మ, స్నేహ రాణా, అమంజోత్ కౌర్, ఉమా ఛెత్రి, అరుంధతి వర్మ.
దక్షిణాఫ్రికా - లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), నాడిన్ డి క్లెర్క్, మారిజాన్ కాప్, తజ్మిన్ బ్రిట్స్, అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, సినాలో జాఫ్తా, నోంకులులెకో మ్లాబా, మసాబాటా క్లాస్, సునే లూయస్, కరాబో మెసో, అన్నేరి డిర్క్‌సేన్, టుమీ నొగాడుక్‌సేన్, అన్నెకే బోస్‌స్‌హూ.
Follow Us