/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
BREAKING NEWS
భారత హాకీ క్రీడా ప్రపంచంలో విషాద వార్త వచ్చింది. హాకీ క్రీడా చరిత్రలో చెరగని ముద్ర వేసిన మాజీ గోల్ కీపర్, ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మాన్యువల్ ఫ్రెడరిక్ 78 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ (అక్టోబర్ 31) బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ఆయన ఎన్నో పతకాలను సాధించి.. భారత కీర్తిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పారు.
Manuel Frederick Died
Hockey India mourns the loss of Olympian Manuel Frederick. The former goalkeeper was a member of India’s Munich 1972 Olympic bronze medal-winning team.#HockeyIndia#IndiaKaGamepic.twitter.com/cM7CoKfV1r
— Hockey India (@TheHockeyIndia) October 31, 2025
హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ తన సంతాపాన్ని వ్యక్తం చేస్తూ.. ‘‘మాన్యువల్ ఫ్రెడరిక్ భారతదేశపు అత్యుత్తమ గోల్ కీపర్లలో ఒకరు. భారత హాకీ స్వర్ణ యుగానికి ఆయన చేసిన కృషి ఎప్పటికీ గుర్తుండిపోతుంది. భారతదేశానికి ప్రాతినిధ్యం వహించాలని కలలు కనే చాలా మంది ఆటగాళ్లకు ఆయన ప్రదర్శనలు స్ఫూర్తినిచ్చాయి. హాకీ ఇండియా తరపున, ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. భారత హాకీ ఒక గొప్ప ఆటగాడిని కోల్పోయింది. కానీ ఆయన వారసత్వం ఎప్పటికీ నిలిచి ఉంటుంది’’ అని అన్నారు.
అనంతరం హాకీ ఇండియా సెక్రటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ కూడా ఆయనకు నివాళులర్పించారు. ‘‘ఇది హాకీ ప్రపంచానికి చాలా విచారకరమైన రోజు. ముఖ్యంగా కేరళ వంటి సాంప్రదాయేతర హాకీ రాష్ట్రం నుండి వచ్చినప్పటికీ, మాన్యువల్ ఫ్రెడరిక్ కృషి, అంకితభావం లెక్కలేనన్ని యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఆయన క్రమశిక్షణ, దేశానికి చేసిన సేవ ఎల్లప్పుడూ గుర్తుండిపోతుంది. ఈ క్లిష్ట సమయంలో మేము ఆయన కుటుంబంతో కలిసి ఉన్నాము.’’ అని తెలిపారు.
మాన్యుయెల్ ఫ్రెడరిక్స్ అక్టోబర్ 20, 1947న కేరళలోని కన్నూర్ జిల్లాలోని బర్నసిరిలో జన్మించారు. భారతదేశం తరపున కాంస్య పతకం గెలుచుకున్న కేరళ నుండి మొదటి అథ్లెట్‌గా ఫ్రెడరిక్స్ నిలిచారు. గోల్ కీపర్‌గా ఆయన ప్రదర్శన ఎంతో మందిని ఆకర్షించింది. దీంతో అతడి నైపుణ్యం, చురుకుదనం కారణంగా ‘భారత గోల్ పోస్ట్‌కి రక్షణ కవచం’గా పేరు సంపాదించుకున్నారు.
ఫ్రెడరిక్ భారత హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన కీలకమైన టోర్నీలో అత్యంత ముఖ్యమైనవి.. 1971 సింగపూర్ ఇంటర్నేషనల్ హాకీ టోర్నమెంట్, 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్ ఉన్నాయి. ఇందులో భాగంగా 1972 మ్యూనిచ్ ఒలింపిక్స్‌లో భారత జట్టు కాంస్య పతకం గెలవడంలో ఫ్రెడరిక్ అత్యంత కీలక పాత్ర పోషించారు.
Follow Us