/rtv/media/media_files/2025/11/01/cricket-2025-11-01-09-57-29.jpg)
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజామ్ చరిత్ర సృష్టించాడు. పురుషుల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బాబర్ బద్దలు కొట్టాడు. ఈ ఘనత సాధించిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు దక్షిణాఫ్రికాపై తొమ్మిది వికెట్ల తేడాతో భారీ విజయం సాధించి, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు (4,231) రోహిత్ శర్మ పేరిట ఉండేది. ఈ మ్యాచ్‌లో 9 పరుగులు చేయగానే బాబర్ ఆజామ్ (Babar Azam) ఈ మైలురాయిని చేరుకున్నాడు. బాబర్ ఆజామ్ ఇప్పుడు 130 మ్యాచ్‌లలో 4,234 పరుగులతో అగ్రస్థానంలో నిలిచాడు. రోహిత్ శర్మ 4,231 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. విరాట్ కోహ్లీ 4,188 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు.
Before he arrives for #BBL15 Pakistan's Babar Azam has eclipsed Rohit Sharma's record as the most prolific batter in T20Is
— cricket.com.au (@cricketcomau) November 1, 2025
Full story: https://t.co/MG8jq9PbUppic.twitter.com/NgFK46QkVJ
పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా
లాహోర్‌లో జరిగిన ఈ రెండో టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ బౌలర్లు అద్భుతంగా రాణించారు. దక్షిణాఫ్రికా జట్టును పాక్ బౌలర్లు 110 పరుగులకే ఆలౌట్ చేశారు. సల్మాన్ మీర్జా (3/14), ఫహీమ్ అష్రఫ్ (4/23) అద్భుత ప్రదర్శన చేశారు. 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని పాకిస్తాన్ కేవలం 13.1 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించింది. యువ ఓపెనర్ సాయిమ్ అయూబ్ కేవలం 38 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సులతో అజేయంగా 71 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బాబర్ ఆజామ్ 11 (నాటౌట్) పరుగులు చేసి, రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఈ విజయంతో సిరీస్ రసవత్తరంగా మారింది. సిరీస్ విజేతను నిర్ణయించే మూడో మరియు చివరి టీ20 మ్యాచ్ శనివారం జరగనుంది.
Follow Us