IND Vs ENG 2ND TEST: విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టిన కెప్టెన్ గిల్

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేయగా.. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ (449 పరుగులు) పేరిట ఉండేది.

New Update
IND Vs ENG 2ND TEST

IND Vs ENG 2ND TEST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేసి భారీ రికార్డులు సృష్టించాడు. ఇప్పుడు రెండో ఇన్నింగ్స్‌లో కూడా కెప్టెన్ గిల్ విజృంభించాడు. రెండో ఇన్నింగ్స్‌లో కూడా అద్భుతంగా బ్యాటింగ్ చేసి సెంచరీ సాధించాడు. దీని ద్వారా గిల్ కెప్టెన్‌గా చరిత్ర సృష్టించాడు. దీనితో పాటు విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులను బద్దలు కొట్టాడు. 

కోహ్లీ, సునీల్ గవాస్కర్ రికార్డులు బద్దలు

శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు విరాట్ కోహ్లీ పేరిట ఉంది. కోహ్లీ తన తొలి సిరీస్‌లో 449 పరుగులు చేశాడు. ఇప్పుడు ఆ రికార్డును కెప్టెన్ శుభ్‌మన్ గిల్ బద్దలు కొట్టాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే.. విరాట్ కోహ్లీ తన తొలి సిరీస్‌లో 449 పరుగులు చేయగా.. గిల్ తన నాలుగో ఇన్నింగ్స్‌లోనే 482 పరుగుల మార్కును దాటడం గమనార్హం. 

Also Read: నాగచైతన్య 'NC24' సెకండ్ షెడ్యూల్ షురూ.. వైరలవుతున్న పోస్టర్!

ఇది మాత్రమే కాకుండా గిల్ మరో బడా క్రికెటర్ సునీల్ గవాస్కర్ రికార్డును సైతం బ్రేక్ చేశాడు. గిల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు లెజెండరీ సునీల్ గవాస్కర్ పేరిట ఉండేది. ఇప్పుడు దాన్ని గిల్ బద్దలు కొట్టాడు. 

Also  Read : పెళ్లికాకుండా తల్లికాబోతున్న నటి.. 40 ఏళ్లలో IVF ద్వారా!

HISTORY CREATED BY GILL

ఇంగ్లీష్ గడ్డపై 1 టెస్ట్ మ్యాచ్‌లో 300 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాట్స్‌మన్‌గా గిల్ నిలిచాడు. 

టెస్ట్ మ్యాచ్‌లో 300 పరుగుల మార్కును దాటిన తొలి భారత కెప్టెన్‌గా గిల్ నిలిచాడు.

కెప్టెన్‌గా మొదటి 2 టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక పరుగుల రికార్డు కూడా గిల్ పేరు మీదే నమోదైంది. 

శుభ్‌మన్ గిల్ కెప్టెన్‌గా తొలి సిరీస్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా కూడా నిలిచాడు. గిల్ ఇప్పటివరకు 482 పరుగులు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు 449 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ పేరిట ఉంది.

గిల్ ఇప్పుడు టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇంతకు ముందు ఈ రికార్డు లెజెండరీ సునీల్ గవాస్కర్ పేరిట ఉంది. 

Advertisment
తాజా కథనాలు