భారత్‌కు తప్పిన ‘ఫాలో ఆన్‌’ గండం.. దుమ్ము దులిపేసిన భారత బౌలర్లు!

బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. అయితే టెయిలెండర్లు ఆదుకోవడంతో ‘ఫాలో ఆన్‌’ గండం నుంచి భారత్ జట్టు బయటపడింది. బూమ్రా, ఆకాశ్ దీప్ మంచి ఆట కనబరిచారు.

New Update
IND VS AUS (1)

బోర్డర్ గావస్కర్ ట్రోఫీ (BGT)లో భాగంగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టులో టీమిండియా బ్యాటర్లు పూర్తిగా విఫలం అయ్యారు. దీంతో ఆసీస్ బౌలర్లు మరింత చెలరేగిపోయారు. త్వరగా ఆలౌట్ చేసేద్దామని అనుకున్నారు. ఈలోపు మేమేం తక్కువ కాదంటూ భారత బౌలర్లు.. బ్యాటింగ్‌లో దుమ్ముదులిపేశారు. బౌలింగ్‌లో తోపు తురుము అని చాటిచెప్పిన జస్‌ప్రీత్ బుమ్రా బ్యాటింగ్‌లో కూడా అదరగొట్టేశాడు. అలాగే బూమ్రాకి తోడు మరో భారత బౌలర్ ఆకాశ్ దీప్ సైతం తన బ్యాటింగ్‌తో వారెవ్వా అనిపించాడు. ఇలా వీరిద్దరు వికెట్ పడకుండా ఆపి టీమిండియాను ‘ఫాలో ఆన్’ నుంచి బయటపడేశారు.

ఇది కూడా చూడండి: ప్రభుత్వ ఉద్యోగులకు రైతు భరోసా.. రేవంత్ సర్కార్ కీలక అప్డేట్!

టెయిలెండర్లు బుమ్రా (10*), ఆకాశ్ దీప్ (27*) పదో వికెట్‌కు 39 పరుగులు చేశారు. ఇక్కడ హైలైట్ ఏంటంటే.. ఆట ముగిసే ముందు ఆకాశ్ దీప్ కొట్టిన సిక్స్‌కి అంతా ఫిదా అయిపోయారు. ఇక లైట్ ఫెయిల్ కారణంగా అంపైర్లు మ్యాచ్‌ను కాస్త ముందుగానే క్లోజ్ చేశారు. దీంతో 4 రోజు ఆట ముగిసే సరికి టీమిండియా 9 వికెట్ల నష్టానికి 252 రన్స్ చేసింది. 

ఇది కూడా చదవండి: SBIలో 13,735 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హత, ఇతర వివరాలివే!

భారత్ ఇంకా 193 రన్స్ వెనుకంజలో ఉంది. ఇక ‘ఫాలో ఆన్’ నుంచి టీమిండియా బయటపడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్, స్మిత్ చెలరేగి ఆడారు. ఇద్దరూ సెంచరీలతో అదరగొట్టారు. భారత బౌలర్లను ఎదుర్కొని మంచి స్కోర్ రాబట్టారు.

ఇది కూడా చూడండి: తానుపారిపోవాలని అనుకోలేదు.. మొదటిసారి స్పందించిన అసద్ 

చితక్కొట్టిన కేఎల్ రాహుల్, జడేజా

భారత్ ఓవర్‌నైట్ 51/4 స్కోరుతో ఇన్నింగ్స్ ప్రారంభించింది. అలా కాసేపటికే ఊహించని షాక్ తగిలింది. కెప్టెన్ రోహిత్ శర్మ 10 పరుగులకే ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కేఎల్ రాహుల్ మంచి ఆట కనబరిచాడు. దాదాపు 84 పరుగులు చేసి ఔరా అనిపించాడు. అలాగే క్రీజ్‌లో ఉన్న మరో బ్యాటర్ జడేజా 77 పరుగులు చేసి అబ్బురపరిచాడు. ఇక సెంచరీ చేస్తాడనుకున్న కేఎల్ రాహుల్ క్యాచ్ ఔటయ్యాడు. 

బౌలర్లే బ్యాటర్లైతే రిజల్ట్ ఇదే

ఆ తర్వాత వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి 16 పరుగులు చేశాడు. అనంతరం బౌల్డ్ అయి పెవిలియన్‌కు చేరాడు. ఇక దూకుడు పెంచే క్రమంలో జడేజా కూడా ఔటయ్యాడు. దీంతో టీమిండియా ఫాలో ఆన్ తప్పదని అంతా భావించారు. కానీ క్రీజ్‌లోకి వచ్చిన బూమ్రా - ఆకాశ్ దీప్ మంచి ఆట కనబరిచారు. దీంతో నాలుగో రోజే ఆలౌట్ కాకుండా ఆటను ముగించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు