/rtv/media/media_files/2025/07/20/world-test-championship-2025-07-20-21-30-59.jpg)
World Test Championship
ప్రపంచ టెస్ట్ ఛాస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ 2031 వరకు ఇంగ్లాండ్‌లోనే జరుగుతాయని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ICC) ప్రకటన చేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) 2019లో మొదలైన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా జరిగిన మూడు ఫైనల్స్‌కు ఇంగ్లాండ్ ఆతిథ్యమిచ్చింది. రాబోయే మూడు WTC (2027,2029,2031) ఫైనల్ మ్యాచ్‌లు కూడా ఇంగ్లాండ్‌లోనే జరగనున్నాయి. వీటి ఆతిథ్య హక్కులను కూడా ఆ దేశమే దక్కించుకుంది.
Also read: ''నా మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు పోతాయి''.. మరో దొంగ బాబా అరాచకం
గత మూడు ఎడిషన్లలో చూసుకుంటే ఈసీబీ ట్రాక్ రికార్డును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ICC తెలిపింది. ఇదిలాఉండగా గత మూడు WTC ఫైనల్స్ సౌథాంప్టన్ (2021), ది ఒవల్ (2023), లార్ట్స్ (2025) వేదికగా జరిగిన విషయం తెలిసిందే. గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా గెలిచింది. అంతకుముందు రెండు ఎడిషన్లలో చూసుకుంటే భారత్ ఫైనల్‌కు వెళ్లింది. కానీ 2021లో న్యూజిలాండ్, 2023లో ఆస్ట్రేలియా విజయం సాధించాయి.
Also Read: CRPF జవాన్‌ను చితకబాదిన శివ భక్తులు.. వీడియో వైరల్