/rtv/media/media_files/2025/07/20/maharashtra-2025-07-20-19-59-03.jpg)
Self-Styled 'Baba' Hits Followers, Feeds Them His Urine In Maharashtra
దేశంలో చాలామంది దొంగబాబాలు జనాలను మోసం చేస్తూ పబ్బం గడుపుతున్నారు. తాజాగా మరో దొంగ బాబా అరాచకం బయటపడింది. తన మూత్రం తాగితే అనారోగ్య సమస్యలు పోతాయని.. తన షూతో మోహం పగలగొడితే కలిసొస్తుందని, చెట్ల ఆకులు తింటే కోరుకున్నంత జీతం వస్తుందనే మాటలు చెబుతూ జనాలను మోసం చేస్తున్నాడు. ఇక వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజినగర్ జిల్లా శివూర్ గ్రామంలో అఘోరీ బాబా అలియాస్ సంజయ్ పాగారే అమాయకులైన స్థానికులపై దారుణాలకు పాల్పడుతున్నాడు.
Also Read: పెళ్లిలో వింత చేష్టలు.. భోజనాన్ని వేలం వేసిన వధూవరులు
అనారోగ్య సమస్యలతో బాధపడేవాళ్లకు తన మూత్రం తాగితే అవి పోతాయంటూ నమ్మించాడు. దీన్ని నమ్మిన పలువురు స్థానికులు అతడి మూత్రం తాగారు. అలాగే మహిళలు, పురుషులపై దండలతో దండించడం, షూతో మోహంపై దాడి చేయడం లాంటివి చేశాడు. అక్కడి చెట్ల ఆకులు తినమన్నాడు. అంతేకాదు తన దగ్గరికి వచ్చేవారి మోహంపై నడవడం, పసుపు చల్లడం, షూ వాసన చూపించడం లాంటి దారుణాలకు కూడా పాల్పడ్డాడు.
Also Read: దారుణం.. అప్పుల బాధ తట్టులేక ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య
చివరికి దొంగ బాబాలను గుర్తించి వాళ్లకు బుద్ధి చెప్పే ఓ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు స్ట్రింగ్ ఆపరేషన్ చేపట్టారు. ఆ దొంగ బాబాను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అతడిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. తాము మోసపోయాని స్థానికులు గ్రహించారు. ఆ దొంగ బాబాను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేస్తున్నారు.