RCB VS PBKS: ఫైనల్స్ కు వెళ్ళేది ఎవరు? క్వాలిఫయర్‌ 1లో ఈరోజు పంజాబ్‌ × బెంగళూరు

ఐపీఎల్ 18లో లీగ్ దశ ముగిసింది. నాలుగు టీమ్ లు క్వాలిఫయర్స్ వరకు వచ్చాయి. ఇప్పుడు ఇక అసలు సమరం మొదలైంది. ఈరోజు క్వాలిఫయర్ 1 మ్యాచ్ జరగనుంది. ఇందులో బెంగళూరు, పంజాబ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిస్తే ఫైనల్స్ కు వెళతారు. 

New Update
ipl

RCB VS PBKS

RCB VS PBKS: ఐపీఎల్(IPL) లో ఇప్పటి వరకు ఈ రెండు టీమ్స్ కప్ ను గెలవలేదు. చాలాసార్లు అవకాశం వచ్చినా చివరకు నిరాశే మిగిలింది. ఆ రెండు జట్లే బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్. ఈసీజన్ లో ఈ రెండు జట్లూ మొదట నుంచి నిలకడగా ఆడుతున్నాయి. అన్ని విభాగాల్లో చక్కని ఆటను ప్రదర్శననిస్తున్నాయి. ఇప్పుడు ఈ సీజన్ లో టేబుల్ టాప్ గా నిలిచి క్వాలిఫయర్స్ కు ఎంపిక అయ్యాయి. బలాల్లో రెండూ ఒకేలా ఉన్న బెంగళూరు, పంజాబ్ రెండింటి పైనా మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు ఈ టీమ్స్ ప్లే ఆఫ్స్ కు సిద్ధమయ్యాయి. 

Also Read: మధ్యప్రదేశ్‌లో విషాదం... కన్నబిడ్డను కాపాడలేనన్న భయంలో ప్రాణం విడిచిన తండ్రి

ఐపీఎల్ సీజన్ 18లో  ప్లే ఆఫ్స్ సమరం మొదలవుతోంది. ఈరోజు మొదటి మ్యాచ్ జరగనుంది(bangalore punjab match). బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్, పంజాబ్ కింగ్స్ మొదటి మ్యాచ్ లో తలపడనున్నాయి. మంచి ఫామ్ లో ఉన్న ఆర్సీబీ, పీబీకేఎస్ మధ్య జరనున్న మ్యాచ్ హోరాహోరీగా సాగనుందని అంచనాలు వెలువడుతున్నాయి(pbks vs rcb dream11 prediction). లీగ్ దశలో రెండు టీమ్ లూ మంచి ఆటను ప్రదర్శించాయి. దీంతో టేబుల్ టాప్ లో నిలిచాయి. మొత్తం 14 మ్యాచ్ లు ఆపిన ఆర్సీబీ, పంజాబ్ సమానంగా తొమ్మిది మ్యాచ్ లు గెలిచాయి. అయితే పంజాబ్ కు మెరుగైన రన్ రేట్ ఉండడంతో ఫస్ట్ ప్లేస్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు ప్లే ఆఫ్స్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు నేరుగా ఫైనల్కు అర్హత సాధిస్తారు. ఓడిన జట్టు ఫైనల్లో చోటు కోసం ఎలిమినేటర్‌లో గెలిచిన జట్టుతో తలపడాల్సివుంటుంది.

Also Read: Parcel Bomb: పెళ్లి గిఫ్ట్‌గా పార్సల్ బాంబ్.. ఇద్దరిని చంపిన లెక్చరర్‌‌కి శిక్ష ఏంటో తెలుసా?

సూపర్ ఫామ్ లో ఆర్సీబీ..

ఆర్సీబీ ఇటు బ్యాటింగ్, అటు బైలింగ్ రెండిటిలోనూ బలంగా ఉంది. ముఖ్యంగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన టైమ్ లో ఫామ్ లోకి వచ్చాడు. గత ఐదు మ్యాచ్ లలో వరుసగా హాఫ్ సెంచరీలు చేశాడు. మరోవైపు పవర్ ప్లేలో ఓపెనర్ సాల్ట్ ఇరగదీస్తున్నాడు. దానికి తోడు జట్టులోకి డీ విలియర్స్ వచ్చి చేరుతాడని తెలుస్తోంది. ఇక మిడిలార్డర్ లో జితేశ్ శర్మ చితక్కొడుతున్నాడు. మధ్యలో గాయలు జట్టును ఇబ్బంది పెట్టినా ఇప్పుడు అందరూ సెట్ అయ్యారు. హేజిల్‌వుడ్‌.. భువనేశ్వర్, యశ్‌ దయాళ్, షెపర్డ్‌లతో పేస్‌ బాధ్యతలు పంచుకుంటారు. కృనాల్, సుయశ్‌ స్పిన్‌ చేస్తారు. లీగ్ దశలో పంజాబ్ మీద ఆర్సీబీ గెలిచింది. ఇది కూడా ప్లే ఆఫ్స్ లో ఆ జట్టు గెలవడానికి దోహదపడే అంశం. ఇప్పుడు కనుక పంజాబ్ మీద గెలిస్తే ఈ సాలా కప్ నమ్దే అనడంలో ఏం సందేహం లేదు. 

Also Read: Miss World 2025: తుది పోటీకి 40 మోడల్స్ సిద్ధం – మిస్ వరల్డ్ కిరీటానికి చివరి పోరు మొదలు!

పంజాబ్ జోరు..

గత సీజన్ లో కోలకత్తాకు కప్ ను అందించిన శ్రేయస్ అయ్యార్ ఇప్పుడు పంజాబ్ కు కప్ అందించే పనిలో పడ్డాడు. ఇతని కెప్టెన్సీలో జట్టు పంజాబ్ జట్టు అదరగొడుతోంది. 2014 తర్వాత ఈ జట్టు ప్లే ఆఫ్స్ కు రావడం ఇదే తొలిసారి. కెప్టెన్‌ శ్రేయస్, కోచ్‌ రికీ పాంటింగ్‌లు పంజాబ్‌కు గొప్ప బలంగా మారారు. బ్యాటింగ్ లో పియాంశ్ ఆర్య, ప్రభ్ మన్ సింగ్, శ్రేయస్, ఇంగ్లిస్ లు దంచుతున్నారు. దాంతో పాటూ శశాంక్ సింగ్ ఫినిషర్ గా మెరిపిస్తున్నాడు. అయితే పంజాబ్ జట్టులో బౌలింగ్ మాత్రం కాస్త వీక్ అనే చెప్పాలి. మెయిన్ బౌలర్ మార్కూ యాన్సెన్ వెళ్ళిపోవడం గట్టి దెబ్బ అనే చెప్పాలి. లెగ్ స్పిన్నర్ చాహల్ మళ్ళీ వస్తే కాస్త పర్వాలేదు. ప్రస్తుతానికి అర్షదీప్ సింగ్ మాత్రమే జట్టును ఆదుకునే బౌలర్ అని చెప్పవచ్చును. 

Also Read: USA: యూఎస్ సిటిజెన్ పోస్టులను సెన్సార్ చేస్తే వీసా నిషేధం..అమెరికా మరో నిర్ణయం

Advertisment
Advertisment
తాజా కథనాలు