/rtv/media/media_files/2025/08/11/father-2025-08-11-15-31-42.jpg)
ఇంగ్లాండ్ క్రికెటర్ జోస్ బట్లర్(Jos Buttler) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతని తండ్రి జాన్ బట్లర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని జోస్ బట్లర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించాడు. రెస్ట్ ఇన్ పీస్ డాడ్.. మీరు నాకు ఇచ్చిన ప్రతిదానికీ ధన్యవాదాలు అంటూ తన తండ్రితో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేశాడు. అయితే తన తండ్రి మృతికి గల కారణాలను మాత్రం వెల్లడించలేదు. కాగా జాన్ బట్లర్ ఆత్మకు శాంతి చేకూరలని, జోస్ బట్లర్ దైర్యంగా ఉండాలంటూ సహచర ఆటగాళ్లు, అభిమానులు కామెంట్స్ చేస్తు్న్నారు. ఈ విషాద సమయంలో కూడా బట్లర్ "ది హండ్రెడ్" టోర్నమెంట్‌లో తన జట్టు అయిన మాంచెస్టర్ ఒరిజినల్స్ తరఫున ఆడారు. అతని తండ్రికి నివాళిగా, జట్టు సభ్యులందరూ బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్‌లు ధరించారు. ఈ మ్యాచ్ లో నాలుగు బంతులను ఎదురుకున్న బట్లర్ ఖాతా తెరవకుండానే వెనుదిరిగాడు.
Jos Buttler's father has passed away.
— ADITYA 🇮🇹 (@140oldtrafford) August 11, 2025
Heartfelt condolences to Jos Buttler and his family on the loss of his father, May his father’s soul rest in peace. pic.twitter.com/sEHY8bSNL4
Also Read : ఛత్తీస్‌గఢ్ యువకుడికి కోహ్లీ, డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్..బిగ్ ట్విస్ట్ ఏంటంటే?
T20 ఫార్మాట్‌లో 13,000 పరుగులు
ఇటీవల జరిగిన T20 బ్లాస్ట్ 2025లో యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో బట్లర్ తన T20 కెరీర్‌లో 13,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించిన ఏడవ ఆటగాడిగా, ఇంగ్లాండ్ తరపున అలెక్స్ హేల్స్ తర్వాత రెండో ఆటగాడిగా నిలిచాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఇంగ్లాండ్ పేలవమైన ప్రదర్శన తర్వాత, బట్లర్ టీ20 కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. అతని స్థానంలో హ్యారీ బ్రూక్ కొత్త కెప్టెన్‌గా నియమితులయ్యారు.
వన్డే క్రికెట్‌లో ఇంగ్లాండ్ తరపున అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన రికార్డు జోస్ బట్లర్ పేరు మీద ఉంది. 2015లో పాకిస్తాన్‌పై కేవలం 46 బంతుల్లోనే అతను ఈ ఘనత సాధించాడు. బట్లర్ ఒక అద్భుతమైన వికెట్ కీపర్-బ్యాట్స్‌మెన్‌గా, అంతేకాకుండా కెప్టెన్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. ఇంగ్లాండ్‌ను రెండు వరల్డ్ కప్‌లలో విజేతగా నిలిపి, మంచి నాయకుడిగా పేరు పొందాడు. బట్లర్ 2017లో లూయిస్ వెబ్బర్‌ను వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
Also Read : టీమిండియాకు బిగ్ షాక్..వన్డే ఫార్మాట్ కు రోకో రిటైర్ మెంట్!