/rtv/media/media_files/2025/08/10/rohit-and-kohli-2025-08-10-15-13-50.jpg)
టీ20, టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు త్వరలోనే వన్టేలకు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. చూస్తుంటే 2027 క్రికెట్ ప్రపంచ కప్ ఆడాలనే వారి కల నెరవేరకపోవచ్చు. ఇప్పుడు బీసీసీఐ షరతులకు అంగీకరించకపోతే మాత్రం వీరిద్దరూ వన్డే ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకునే అవకాశం ఉందనేది క్రికెట్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
OMG, are we really asking Virat Kohli and Rohit Sharma to prove themselves in the Vijay Hazare Trophy at this stage? 😭
— Zeke Yeager (@zekecodes) August 10, 2025
These legends have carried India on their shoulders for YEARS, 117 in the '23 WC semifinal, 76 in the T20 WC final, and now this?
BCCI, give them a farewell…
2027 వన్డే ప్రపంచకప్ వరకు
2027 వన్డే ప్రపంచకప్ వరకు రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకూ వీరిద్దరూ తమ ఫిట్‌నెస్‌ను కాపాడుకోవాలి. అంతేకాకుండా ఫామ్‌ను కంటిన్యూ చేయడం కూడా చాలా ముఖ్యం. ఈ క్రమంలో వారిద్దరినీ సెలక్ట్ చేయాలంటే బీసీసీఐ ఓ కండీషన్ పెట్టినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. దేశవాళీ వన్డే ఫార్మాట్ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈ మ్యాచుల్లో వారిద్దరూ పాల్గొంటేనే వన్డే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం పరిగణనలోకి తీసుకొనే అవకాశం ఉంటుంది. అందులో ఆడకపోతే దాదాపుగా వీరి దారులు దాదాపు మూసుకుపోయినట్లేనని తెలుస్తోంది. కొత్త జట్టు తయారు చేసుకునేందుకే హెడ్ కోచ్ గంభీర్ మొగ్గు చూపిస్తున్నట్లుగా తెలుస్తోంది . ఇప్పటికే టెస్టుల విషయంలోనూ ఇదే జరిగింది. కొత్త డబ్ల్యూటీసీ సీజన్‌లో గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక ప్రధాన కారణమదే. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆడదామని తొలుత రోహిత్, కోహ్లీ భావించారు అయితే భవిష్యత్తు అవసరాల దృష్ట్యా ఎంపిక చేయడం కష్టమేనని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే వారు టెస్టులకు వీడ్కోలు పలికారంటూ గుసగుసలు వినిపించాయి.
విరాట్ కోహ్లీ లండన్‌లో ప్రాక్టీస్
ఆస్ట్రేలియాలో జరిగే సిరీస్ తో వీరిద్దరి భవితవ్యం ఏంటో తెలనుంది. మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా సిరీస్‌తో తేలనుంది. ఆసీస్‌తో వన్డేలను టీమ్‌ఇండియా ఆడనుంది. ఇప్పటికే విరాట్ కోహ్లీ లండన్‌లో ప్రాక్టీస్ మొదలుపెట్టేశారు కూడా. ప్రస్తుతం టీమ్‌ఇండియాకు వన్డే ఫార్మట్ లో కెప్టెన్ గా రోహిత్ శర్మనే ఉన్నాడు. ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలోనే టీమ్‌ఇండియా నెగ్గింది. దీంతో ఆసీస్‌తో వన్డే సిరీస్ కోసం రోహిత్, కోహ్లీని ఎంపిక చేయడంపైనా సందేహాలు ఉన్నాయి. శుభ్‌మన్ గిల్‌ను కెప్టెన్ చేస్తారా లేకా రోహిత్‌నే కొనసాగిస్తారా తెలియాల్సి ఉంది.
బంగ్లాదేశ్ సిరీస్ తర్వాత, టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.అక్కడ ఆస్ట్రేలియాతో 3 వన్డేల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ అక్టోబర్ 19న పెర్త్‌లో ప్రారంభమవుతుంది. తదుపరి మ్యాచ్‌లు అడిలైడ్, సిడ్నీలో జరుగుతాయి.ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్‌లో దక్షిణాఫ్రికా జట్టు పర్యటించనుంది. రెండు జట్ల మధ్య నవంబర్ 30 నుంచి 3 వన్డేల సిరీస్ జరగనుంది. ఈ మ్యాచ్‌లు రాంచీ, రాయ్‌పూర్, విశాఖపట్నంలో జరుగుతాయి.
Also Read : Mega Heroes: అబ్బా ఫ్రేమ్ అదిరింది.. జిమ్ లో మెగా హీరోల రచ్చ! వైరలవుతున్న పిక్