/rtv/media/media_files/2025/08/10/phone-call-2025-08-10-17-31-15.jpg)
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక యువకుడికి విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ నుండి ఫోన్ కాల్స్ వచ్చాయి. అయితే దీని వెనుక ఓ ఆస్తికరమైన కథనం దాగి ఉంది. ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ జిల్లాకు చెందిన మనీష్ బిసి అనే 21 ఏళ్ల యువకుడు ఇటీవల ఒక కొత్త సిమ్ కార్డును కొనుగోలు చేశాడు. అయితే ఈ సిమ్ కార్డు గతంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్‌కు చెందినది. నిబంధనల ప్రకారం 90 రోజులకు పైగా ఉపయోగించని నంబర్‌ను టెలికాం కంపెనీలు కొత్త కస్టమర్లకు తిరిగి కేటాయిస్తాయి.
🚨BIG NEWS🚨
— DIVYANSH CHAUHAN (@Imchauhan28) August 10, 2025
A guy from Chhattisgarh purchased a new sim which turned out to be Rajat Patidar's old number.
- He received calls from Virat Kohli and AB De Villiers, but after Patidar informed the Police, the man returned the sim. pic.twitter.com/Uk40U43wOL
ఈ ప్రక్రియలో భాగంగా పాటిదార్ పాత నంబర్ మనీష్‌కి కేటాయించబడింది. కొత్త సిమ్ తీసుకున్న తర్వాత మనీష్‌కి ఆశ్చర్యకరమైన ఫోన్ కాల్స్ రావడం మొదలయ్యాయి. కాల్ చేసిన వాళ్లు తమను విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్, యశ్ దయాల్ అని పరిచయం చేసుకున్నారు. వాళ్లంతా మనీష్‌ను రజత్ అని పిలిచారు. జూలై 15 వరకు ఇదే ప్రక్రియ కొనసాగింది, కానీ ఒకరోజు ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పాటిదార్ ఆ నంబర్‌కు కాల్ చేశాడు. నేను రజత్ పాటిదార్, ఆ నంబర్ నాది, దయచేసి దాన్ని తిరిగి ఇవ్వండి అని అన్నాడు. ముందుగా వారు నమ్మలేదు.
పోలీసుల వరకూ
దీంతో ఈ విషయం కాస్త పోలీసుల వరకూ చేరింది. పోలీసులు మనీష్‌ను కలిసి విషయం వివరించారు. అప్పటి వరకు అది కేవలం ఒక ప్రాంక్ కాల్‌గా భావించిన మనీష్, తన స్నేహితుడు ఖేమ్‌రాజ్‌తో కలిసి జరిగిన విషయాన్ని పోలీసులకు చెప్పాడు. ఆ తర్వాత అతను ఆ సిమ్ కార్డును తిరిగి ఇచ్చేందుకు అంగీకరించాడు. ఈ సంఘటనపై మనీష్, ఖేమ్‌రాజ్ సంతోషం వ్యక్తం చేశారు. ఖేమ్‌రాజ్ మాట్లాడుతూ, ఒక తప్పుడు నంబర్ కారణంగా కోహ్లీతో మాట్లాడే అవకాశం వచ్చింది. నా జీవిత లక్ష్యం పూర్తయిందని చెప్పాడు. ఒక సాధారణ యువకుడికి తన అభిమాన క్రికెటర్లతో మాట్లాడే అరుదైన అవకాశం లభించడం అరుదైన ఘటనే అని చెప్పుకోవాలి. కాగా ఐపీఎల్ 2025 సీజన్‌లో రజత్ పాటిదార్ ఇటీవల రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు కెప్టెన్‌గా నియమితులయ్యారు. ఆయన సారథ్యంలో RCB తొలిసారిగా టైటిల్‌ను గెలుచుకుంది. ఈ విజయం తర్వాత, కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే ఐపీఎల్ ట్రోఫీ సాధించిన ఆటగాళ్ల ప్రత్యేక జాబితాలో రజత్ పాటిదార్ కూడా చేరారు.
Also Read : This week Movies: ఈ వారం ఓటీటీ, థియేటర్లో కొత్త సినిమాల జాతర.. సినీ లవర్స్ కి పండగే