BREAKING: లార్డ్స్ టెస్ట్‌లో భారత్ ఘోర ఓటమి!
లార్డ్స్ టెస్టులో భారత్ ఓటమిపాలైంది. 22పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది. దీంతో 5 టెస్టుల సిరీస్ లో ఇంగ్లాండ్ 2-1తో ముందంజలో నిలిచింది. జడేజా 61* (నాటౌట్) ఒంటరిపోరాటం వృథా అయింది. ఆఖర్లో బుమ్రా, సిరాజ్ సహకరించినా తృటిలో విజయం చేజారింది.