RCB Vs DC: కేఎల్ రాహుల్‌తో కోహ్లీ గొడవ.. వీడియో వైరల్!

ఆదివారం ఢిల్లీ, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరకు వెళ్లిన విరాట్ కోపంగా ఏదో అన్నాడు. దీంతో వివరణ ఇచ్చేందుకు రాహుల్ ట్రై చేసినా కోహ్లీ పట్టించుకోలేదు.

New Update
dc rcb ipl

Delhi vs Bangalore match Kohli and Rahul argument

RCB vs DC: ఆదివారం ఢిల్లీ, బెంగళూర్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. కోహ్లీ, రాహుల్ మధ్య వాగ్వాదం జరిగింది. కీపింగ్ చేస్తున్న రాహుల్ దగ్గరకు వెళ్లిన విరాట్ కోపంగా ఏదో అన్నాడు. దీంతో వివరణ ఇచ్చేందుకు రాహుల్ ట్రై చేసినా కోహ్లీ పట్టించుకోలేదు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఇక మ్యాచ్ అనంతరం విరాట్, రాహుల్ ఒకరినొకరు హగ్ చేసుకుని నవ్వుతూ కనిపించారు.

Also Read :  పాక్‌తో యుద్దానికి సిద్దమైన భారత్..!

Also Read :  బ్యాక్‌గ్రౌండ్ లేకుండానే భారీ పాపులారిటీ.. సామ్ బర్త్ డే స్పెషల్ స్టోరీ!

రాణించిన కోహ్లీ..

ఈ మ్యాచ్ లో బెంగళూర్ విజయం సాధించింది. విరాట్ కోహ్లీ అర్ధ సెంచరీతో రాణించాడు. మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 161 పరుగులు చేసింది. దీంతో 162 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు జట్టు మొదట్లోనే 3 వికెట్లు కోల్పోయింది. కానీ ఓపెనర్ గా వచ్చిన కింగ్ కోహ్లీ  (51)  నిలకడగా ఆడుతూ జట్టును నిలబెట్టాడు. అలాగే కృనాల్ (73*) విజృంభించేశాడు. దీంతో వరుసగా మూడు మ్యాచ్ లు గెలిచిన బెంగళూరు జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. ఢిల్లీ బౌలర్లలో అక్షర్‌ పటేల్‌ 2 వికెట్లు తీశాడు. 

Also Read :  యాదాద్రి థర్మల్ పవర్‌ ప్లాంట్‌లో భారీ అగ్ని ప్రమాదం

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ ధనాధన్‌ బ్యాటింగ్‌తో 3 ఓవర్లలో 32/0తో నిలిచింది.  అభిషేక్‌ పోరెల్‌ (28; 11 బంతుల్లో 2×4, 2×6), డుప్లెసిస్‌ (22; 26 బంతుల్లో 2×4), రాహుల్‌ (41; 39 బంతుల్లో 3×4), స్టబ్స్‌ (34; 18 బంతుల్లో 5×4, 1×6) రాణించారు. భువనేశ్వర్‌ (3/33), హేజిల్‌వుడ్‌ (2/36), కృనాల్‌ (1/28), సుయశ్‌ (0/22) ఢిల్లీని కట్టడి చేశారు.

Also Read :  ఉగ్రదాడి నిందితులపై సైన్యం కాల్పుల వర్షం

 IPL 2025 | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు