/rtv/media/media_files/2025/04/27/ftRE3hfpad2UqIuJjY5L.jpg)
DC vs RCB Live Score Photograph: (DC vs RCB Live Score)
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తొలి ఇన్నింగ్స్ పూర్తయింది. నిర్దేశించిన 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 162 పరుగులు సాధించింది. దీంతో ఆర్సీబీ ముందు 163 టార్గెట్ ఉంది.
అభిషేక్ పొరేల్ (28), డుప్లెసిస్ (22), కరుణ్ నాయర్ (4), కేఎల్ రాహుల్ (41), అక్షర్ పటేల్ (15), స్టబ్స్ (34), శర్మ (2), నిగమ్ (12) పరుగులు చేశారు.
Also Read: స్టూడెంట్స్తో బలవంతంగా నమాజ్ .. ఏడుగురు టీచర్లపై కేసు!
టాస్ ఓడి బ్యాటింగ్‌కు
ముందుగా టాస్ గెలిచిన బెంగళూరు జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టు ఓపెనర్లు మంచి ఫామ్ అందించారు. అభిషేక్ పోరెల్, డుప్లెసిస్ మొదటి నుంచి దూకుడుగా ఆడారు. కానీ ఓపెనర్ అభిషేక్ పోరెల్ క్రీజులో ఎక్కువ సమయం నిలబడలేకపోయాడు.
Also Read: భారీ పేలుడు.. 25 మంది స్పాట్ డెడ్ -1,139 మందికి తీవ్ర గాయాలు
జోష్ హేజిల్‌వుడ్ బౌలింగ్‌లో పోరెల్ (28) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజ్‌లోకి వచ్చిన కరుణ్ నాయర్ మరుసటి ఓవర్‌లోనే పెవిలియన్‌కు చేరాడు. నాయర్ (4) ఔట్ అయ్యాడు. దీంతో 5 ఓవర్లకు 2 వికెట్ల నష్టానికి 45 పరుగులు సాధించారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, డుప్లెసిస్ మెల్లి మెల్లిగా పరుగులు రాబట్టారు.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
ఆచితూచి ఆడుతున్న సమయంలో మరో బిగ్ షాక్ తగిలింది. డుప్లెసిస్ (22) ఔట్ అయ్యాడు. కృనాల్ పాండ్య వేసిన 9.5 ఓవర్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ఢిల్లీ జట్టు 10 ఓవర్లకు 3 వికెట్లు నష్టపోయి 72 పరుగులు మాత్రమే చేసింది. గత మ్యాచ్‌లతో పోల్చుకుంటే ఇది చాలా తక్కువ స్కోర్ అనే చెప్పాలి. ఇలా మొత్తంగా 20 ఓవర్లలో 162 పరుగులు సాధించింది.
Also Read: కేంద్రం కీలక నిర్ణయం.. NIA చేతికి పహల్గాం ఉగ్రదాడి కేసు
dc vs rcb | latest-telugu-news | sports-news | telugu-news