Axar Patel: ఢిల్లీ కెప్టెన్‌కు బిగ్ షాక్.. భారీ జరిమానా.. ఎందుకంటే!

ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్షర్ ప‌టేల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. ముంబైతో మ్యాచ్ లో స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా భారీ జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళిని ఆర్టిక‌ల్ 2.22 ఉల్లంఘ‌న కింద రూ.12 లక్షల జ‌రిమానా విధించిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. 

New Update
dc mi

Delhi Capitals captain Axar Patel fined

Axar Patel: ముంబైతో మ్యాచ్ ఓడిన బాధలో ఉన్న ఢిల్లీ క్యాపిట‌ల్స్ కెప్టెన్ అక్షర్ ప‌టేల్‌కు మరో బిగ్ షాక్ తగిలింది.  స్లో ఓవ‌ర్ రేటు కార‌ణంగా భారీ జరిమానా విధించారు. ఐపీఎల్ ప్రవ‌ర్తనా నియ‌మావ‌ళిని ఆర్టిక‌ల్ 2.22 ఉల్లంఘ‌న కింద అత‌నికి రూ.12 లక్షల జ‌రిమానా విధించిన‌ట్లు బీసీసీఐ తెలిపింది. 

ఢిల్లీకి తొలి ఓటమి..

ఇక ఆదివారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఈ  సీజన్ లో తొలి చవిచూసింది. ఉత్కంఠంగా జ‌రిగిన మ్యాచ్‌లో ముంబైపై 12 ర‌న్స్ తేడాతో ఓడిపోయింది. ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై నిర్ణీత 20 ఓవ‌ర్లలో 5 వికెట్ల న‌ష్టానికి 205 పరుగులు చేసింది. భారీ టార్గెట్‌తో బ‌రిలోకి దిగిన ఢిల్లీ 19 ఓవ‌ర్లలో 193 పరుగులకు ఆలౌటైంది. ఇక అక్షర్ పటేల్ కూడా దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఐపీఎల్‌లో అక్షర్ 5 మ్యాచుల్లో ఒక్క వికెట్ తీయ‌లేదు. బ్యాటింగ్‌లో 67 ర‌న్స్ మాత్రమే చేశాడు.

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

ఢిల్లీ బ్యాటర్ కరుణ్‌ నాయర్‌  40 బంతుల్లో 12 ఫోర్లు, 5 సిక్స్‌లతో 89 పరుగులు చేశారు. ముంబయి బౌలర్లలో కర్ణ్‌ శర్మ 3, దీపక్‌ చాహర్‌ 1, బుమ్రా 1, శాంట్నర్‌ 1 వికెట్లు తీశారు. ముంబయ్ కు ఇది రెండో విజయం.  ముంబై బ్యాటర్లలో తిలక్‌ వర్మ హాఫ్‌ సెంచరీతో చెలరేగాడు. 33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సులో 59 పరుగులు చేశాడు. రికెల్టన్ 41, సూర్యకుమార్ 40, నమన్ 38 పరుగులతో రాణించారు. ఢిల్లీ బౌలర్లలో విప్రజ్, కుల్దీప్ చెరో రెండు వికెట్లు, మకేశ్ ఓ వికెట్ పడగొట్టాడు. 

Also Read: గ్రాఫిక్స్ గాలికి వదిలేశారా..? విశ్వంభరపై 'బన్ని' ప్రొడ్యూసర్ హాట్ కామెంట్స్

delhi | mumbai | IPL 2025 | telugu-news | today telugu news

Advertisment
తాజా కథనాలు