/rtv/media/media_files/2025/05/11/68Uj32eox8KuGuwWawat.jpg)
pakistan player
భారత్, పాకిస్తాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) 2025 నిరవధికంగా వాయిదా పడింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మిగిలిన 8 మ్యాచ్‌లను దుబాయ్‌లో నిర్వహించాలని ప్లాన్ చేస్తోంది. కానీ దానికి ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు (ECB) షాక్ ఇచ్చింది. భద్రతా సమస్యలను పేర్కొంటూ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ఆతిథ్యానికి అనుమతి ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో టోర్నమెంట్‌ను వాయిదా వేయడం తప్ప పీసీబీకి వేరే మార్గం లేదు.
Also Read : 100ఏళ్లైనా ఈ వీడియోలు మర్చిపోలేం.. భారత్ చరిత్రకు సాక్ష్యాలివే..!
టోర్నమెంట్ వాయిదా పడిపోవడంతో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో పాల్గొనే విదేశీ ఆటగాళ్లను మొదట యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లారు. అక్కడి నుండి వారు తమ తమ దేశాలకు కనెక్టింగ్ విమానాలలో వెళ్లారు. దుబాయ్ చేరుకున్న తర్వాత బంగ్లాదేశ్ క్రికెటర్ రిషాద్ హుస్సేన్ మాట్లాడుతూ, పాకిస్తాన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత తనకు ఉపశమనం కలిగిందని అన్నారు. తన చార్టర్డ్ విమానం టేకాఫ్ అయిన విమానాశ్రయం సమీపంలో కేవలం 20 నిమిషాల తర్వాత క్షిపణి దాడి చేసిందని చెప్పాడు.
Also Read : POKని భారత్‌కు అప్పగించాల్సిందే.. మోదీ సంచలన డిమాండ్
New Zealand cricketer Daryl Mitchell made headlines with his shocking statement: "I will never go to Pakistan again." Mitchell, who was part of a cricket tour, recalled the tense moments when flights were grounded due to the closure of Lahore’s Allama Iqbal.... Link in bio pic.twitter.com/YtxsscYmC9
— News Feed (@NewssFeedd) May 11, 2025
Also Read : జన్మలో పాకిస్తాన్ కు వెళ్లను.. బంగ్లాదేశ్ ఆటగాడు సంచలన కామెంట్స్
చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు
దీంతో తామంతా చాలా భయపడ్డామని రిషాద్ హుస్సేన్ తెలిపాడు. పేసర్ నహిద్ రాణా చాలా భయపడిపోయాడని.. తాను అతనికి ధైర్యం చెప్పానన్నారు. మిగతా వాళ్లు కూడా భయంతో హడలిపోయారని వెల్లడించాడు. ఇక తాము దుబాయ్‌లో అడుగుపెట్టగానే.. ఇకపై తానెప్పుడూ పాకిస్థాన్‌కు వెళ్లనని న్యూజిలాండ్ ఆటగాడు డేరిల్ మిచెల్ తనతో చెప్పాడని వెల్లడించాడు. టామ్ కర్రన్ వెళ్లే సరికి ఎయిర్‌పోర్ట్ మూసేసినట్లు చెప్పడంతో.. చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడని చెప్పుకొచ్చాడు. ఇద్దరు- ముగ్గురు కలిసి అతడిని ఓదార్చాల్సి వచ్చిందని రిషాద్ వెల్లడించాడు.
Also Read : మే 15 నుంచి ఐపీఎల్.. బీసీసీఐకి బిగ్ టాస్క్!
sports | pakistan-cricket | india