నన్ను మతం మార్చుకోమన్నారు: డానిష్‌ కనేరియా సంచలన వ్యాఖ్యలు

పాకిస్థాన్‌లో వివక్ష కారణంగా తన కెరీర్‌ నాశనమైందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. మతం మార్చుకోవాలని బలవంతం పెట్టినట్లు ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. 

New Update
Pakistan cricketer Danish Kaneria

Pakistan cricketer Danish Kaneria Photograph: (Pakistan cricketer Danish Kaneria)

పాకిస్థాన్‌లో వివక్ష కారణంగా తన కెరీర్‌ నాశనమైందని మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా సంచలన వ్యాఖ్యలు చేశారు. అక్కడ మైనార్టీల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలిపారు. హిందూ అయినా డానిష్‌ని మతం మార్చుకోవాలని బలవంతం పెట్టినట్లు ఇటీవల వాషింగ్టన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో వెల్లడించారు. 

ఇది కూడా చూడండి: గుడ్ న్యూస్ ..త్వరలో తండ్రి కాబోతున్న కేఎల్ రాహుల్

ఇది కూడా చూడండి: Horoscope Today:నేడు ఈ రాశివారు కష్టపడి పని చేస్తే విజయం మీదే!

మతం మారమని పదే పదే..

వివక్ష కారణంగా తన కెరీర్ నాశనమైందని, పాకిస్తాన్‌లో మైనారిటీలు ఎదుర్కొంటున్న సవాళ్లను డానిష్ కనేరియా తెలిపారు. తనపై జరిగిన సంఘటనలను ఇతరులతో పంచుకున్నానని, వివక్షకు వ్యతిరేకంగా గళమెత్తినా కూడా ఫలితం లేదని తెలిపారు. పాకిస్థాన్‌లో తనకి గౌరవం లేదని, అందుకే అమెరికాకు వెళ్లాల్సి వచ్చిందన్నారు. తన మాజీ సహచరుడు షాహిద్ అఫ్రిది ఇస్లాం మతంలోకి మారమని తనని పదే పదే ఒత్తిడి చేశాడని ఆరోపించారు. కొందరు ఆటగాళ్లు తనకి సపోర్ట్ ఇచ్చినప్పటికీ మరికొందరు మాత్రం తనిని చాలా ఇబ్బంది పెట్టినట్లు తెలిపారు.

ఇది కూడా చూడండి: బిగ్ షాక్‌ ..హైదరాబాద్లో రేపు వైన్ షాపులు బంద్ !

కెరీర్ నాశం అయ్యిందని, దక్కాల్సిన గౌరవం దక్కలేదని వెల్లడించారు. ఇంజమామ్-ఉల్-హక్ ఎక్కువగా మద్దతు ఇచ్చారని, మిగతా వారు ఇవ్వలేదని తెలిపారు. తాను ఇస్లాం మతంలోకి వెళ్లకపోవడం వల్ల చాలా మంది కలిసి కూర్చోని కూడా తినలేదన్నారు. పాకిస్తాన్ తరఫున 61 టెస్ట్ మ్యాచ్‌లు కనేరియా ఆడారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రెండవ హిందూ క్రికెటర్ మాత్రమే. ఇప్పటికీ టెస్ట్‌లలో పాకిస్తాన్ తరపున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్‌గా కొనసాగుతున్నారు. 

ఇది కూడా చూడండి: Train Hijack: రైలు హైజాక్‌ ..ఆపరేషన్‌ సక్సెస్‌ అంటున్న పాక్‌ ఆర్మీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు