/rtv/media/media_files/2025/03/07/eQAYsX5Y9Ba7J31pvsPy.jpg)
Champions Trophy Final Photograph: (Champions Trophy Final)
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ దశకు చేరుకుంది. మార్చి 9వ తేదీన దుబాయ్ వేదికగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగనుంది. ఆ రోజున క్రికెట్ ప్రియులు అందరూ టీవీల ముందు అతుక్కుని కూర్చుకుంటారు. మరికొందరు పెద్ద స్క్రీన్ పెట్టుకుని మ్యాచ్‌ను ఆస్వాదిస్తారు. అయితే క్రికెట్ ప్రియులకు నగరంలోని మల్టీ ఫ్లెక్స్‌లు గుడ్ న్యూస్ తెలిపాయి. ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్‌ను థియేటర్లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. మ్యాచ్‌ను థియేటర్‌లో చూడాలని అనుకునే వారు వెంటనే బుక్ టికెట్లు బుక్ చేసుకోండి. అయితే క్రికెట్ అభిమానుల కోసమే థియేటర్ల యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చూడండి: VIRAL VIDEO: కన్నీరు పెట్టిస్తున్న బాల్య వివాహం.. రానంటున్నా భుజంపై ఎత్తుకుని తీసుకెళ్లిన వరుడు!
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ హైదరాబాద్‌లోని మల్టీ ఫ్లెక్స్‌ల్లో ప్రత్యక్ష ప్రసారం వేయనున్నారు. వీటికి సంబంధించిన బుక్సింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ను డైరెక్ట్‌గా ఎలాగో చూడాలేదు, కనీసం థియేటర్లలో అయినా చూడాలని అనుకునే వారికి ఇది బెస్ట్.https://t.co/aWG7CQZMmU…
— RTV (@RTVnewsnetwork) March 7, 2025
ఇది కూడా చూడండి: SVSC Re Release: థియేటర్ లో పూలకుండీ సీన్ రిక్రియేషన్.. SVSC రీరిలీజ్ హంగామా!
గత నెల ప్రారంభమైన..
ఇదిలా ఉండగా ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి 19వ తేదీన పాకిస్థాన్, దుబాయ్ వేదికగా ప్రారంభమైంది. ఈ ట్రోఫీలో మొత్తం 8 జట్లు తలపడ్డాయి. సెమీ ఫైనల్‌లో ఆస్ట్రేలియా మీద భారత్, దక్షిణాఫ్రికా మీద న్యూజిలాండ్ విజయం సాధించి.. చివరకు భారత్, న్యూజిలాండ్ ఫైనల్‌కి చేరాయి. మార్చి 9వ తేదీన ఈ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరగనుంది.
ఇది కూడా చూడండి: gold smuggling : పోలీస్ బాస్‌కు క్రిమినల్ హిస్టరీ.. స్మగ్లింగ్ చేస్తూ దొరికిన కన్నడ హీరోయిన్ తండ్రి కూడా..