Cricket: బౌలర్  హర్షిత్ రాణా ఎంట్రీపై వివాదం...

నిన్న జరిగిన ఇంగ్లాండ్, ఇండియా నాలుగో టీ20లో భారత బౌలర్ హర్షిత్ రాణా ఎంట్రీ వివాదాస్పదంగా మారింది.  మ్యాచ్ సగంలో అతను రావడమే కాకుండా..నాలుగు ఓవర్లలో మూడు వికెట్లు తీసి గెలుపులో కీలకపాత్ర పోషించాడు.

New Update
india

Bowler Harshith Rana

నిన్న జరిగిన నాలుగో టీ20 మ్యాచ్ లో బౌలర్ హర్షిత్ రాణా విజృంభించేశాడు. తన బౌలింగ్ మ్యాజిక్ తో ప్రత్యర్థి ఇంగ్లాండ్ బ్యాటర్లను నిలువరించాడు. అయితే మొదట ప్రకటించిన జట్టులో హర్షిత్ రాణా లేడు. మొదటి ఇన్నింగ్స్ అయ్యాక కంకషన్ సబ్ గా అతను జట్టులోకి వచ్చాడు. మొదటి ఇన్నింగ్స్ లో బ్యాటర్ శివమ్ దూబే హెల్మెట్ కు బంతి బలంగా తాకింది. దీంతో అతని బదులు హర్షిత్ ఆడాలని మేనేజ్ మెంట్ నిర్ణయించింది. అలా జట్టులోకి వచ్చిన అతను అద్భుతంగా బౌలింగ్ చేశాడు. కేవలం నాలుగు ఓవర్లే వేసిన హర్షిత్ రాణా మూడు వికెట్లు తీసి 33 పరుగులు ఇచ్చాడు. 

ఇదే డెబ్యూట్..

హర్షిత్ రాణాకు ఇది డెబ్యూ మ్యాచ్. దూబే దూబె డ్రెస్సింగ్‌ రూమ్‌లోకి వచ్చిన రెండు ఓవర్ల తర్వాత నాకు సమాచారం ఇచ్చారు. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా ఆడాల్సి ఉంటుందని.. సిద్ధంగా ఉండమన్నారు. నేను చాలా రోజుల నుంచి భారత తరుఫున ఆడడానికి ఎదురు చూస్తున్నా. దాంతో నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నా అని చెప్పాడు హర్షిత్ రాణా.  ఐపీఎల్ లో మంచి బౌలింగ్ చేశా. ఇప్పుడు కూడా అదే తరహాలో బౌలింగ్ చేశానని చెప్పుకొచ్చాడు. 

ఇంగ్లాండ్ అసంతృప్తి..

శివమ్ దూబే కు బదులు హర్షిత్ రాణా రావడం పట్ల ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అసంతృప్తి వ్యక్తం చేశాడని తెలుస్తోంది. అప్పుడే అంపైర్లతో చర్చించినా...వారు భారత్ కు అనుకూలంగానే మాట్లాడారు. మ్యాచ్ తరువాత కూడా ఇదే అభిప్రాయాన్ని అతను వ్యక్తం చేశాడు. మాతో సంప్రదించకుండానే నిర్ణయం తీసుకున్నారు. మ్యాచ్ రిఫరీ నిర్ణయం తీసుకున్నారన్నారు. దీనిపై జవగళ్ శ్రీనాథ్ సమాధానం చెప్పాలని బట్లర్ అన్నారు. ప్రస్తుతం దీనిపై సోషల్ మీడియాలో కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. శివమ్‌ దూబె స్థానంలో బౌలర్‌ను ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. దూబె బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ కాగా .. హర్షిత్‌ స్పెషలిస్ట్‌ పేసర్. ఇది సరిగ్గా లేదనిపిస్తోందని క్రికెట్ అభిమానులు అంటున్నారు. 

Also Read: Karthikeya 3: 'కార్తికేయ-3' పై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ చందూ మొండేటి..!

మరోవైపు ఐసీసీ నిబంధనలు కూడా అదే చెబుతున్నాయి. బ్యాటర్ స్థానంలో బ్యాటర్, బౌలర్ స్థానంలో బౌలర్...ఆల్ రౌండర్ స్థానంలో ఆల్ రౌండర్ ను మాత్రమే తీసుకోవాలి. కానీ నిన్న మ్యాచ్ లో ఆల్ రౌండర్ కు బదులు బౌలర్ ను తీసుకున్నారు అయితే రిఫరీ అనుమతి ఇస్తే అది చెల్లుతుంది. నిన్నటి మ్యాచ్ లో రిఫరీ అనుమతి ఇచ్చారు. దీనిపై ప్రత్యర్థి జట్టు అప్పీల్ చేసుకోవడానికి వీలు లేదు. 

Also Read: Chennai Crime: ఏసీ ఆన్‌ చేసి..రసాయనాలు చల్లుతూ...వీడిన చెన్నై తండ్రికూతుళ్ల డెత్‌ మిస్టరీ!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు