/rtv/media/media_files/2025/07/30/stokes-2025-07-30-17-10-44.jpg)
రేపటినుంచి లండన్‌లోని ది ఓవల్‌లో భారత్ తో జరగబోయే ఐదో టెస్టుకు ముందు ఇంగ్లండ్ కు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు కెప్టెన్ బెన్ స్టోక్స్ చివరి టెస్టుకు దూరమయ్యాడు. మాంచెస్టర్‌లో సెంచరీ, ఐదు వికెట్ల పడగొట్టడంతో అద్భుతమైన ఆల్ రౌండ్ ప్రదర్శన ఇచ్చిన స్టోక్స్ కుడి భుజం గాయం కారణంగా అందుబాటులో లేడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐదో టెస్టుకు పోప్ కెప్టెన్ గా వ్యవహరిస్తారని స్పష్టం చేసింది. అతనికి ఇది ఐదో టెస్టు కెప్టెన్సీ కావడం విశేషం. ప్లేయింగ్ 11లో కూడా ఇంగ్లీష్ టీమ్ భారీగానే మార్పులు చేసింది. బెన్ స్టోక్స్ తో పాటుగా ఆర్చర్, కార్స్, డాసన్ లను తప్పించి, జాకబ్ బెథెల్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్‌లను జట్టులోకి తీసుకున్నారు.
Also Read : దేశం కంటే క్రికెట్ ఎక్కువ కాదు.. స్పాన్సర్‌షిప్ నుంచి ఈజ్‌మైట్రిప్ ఔట్!
ఫాస్ట్ బౌలర్ గస్ అట్కిన్సన్ కూడా ఈ సిరీస్‌లో తన తొలి టెస్ట్ ఆడబోతున్నాడు, చివరిసారిగా మే నెలలో జింబాబ్వేతో నాటింగ్‌హామ్‌లో జరిగిన ఏకైక టెస్ట్‌లో ఇంగ్లండ్ తరపున ఆడాడు. ఇక స్టోక్స్ స్థానంలో 21 ఏళ్ల జాకబ్ బెథెల్‌ను జట్టులోకి తీసుకున్నారు. 2024 న్యూజిలాండ్ పర్యటనలో అరంగేట్రం చేసిన జాకబ్ బెథెల్‌మూడు టెస్టుల్లో 52 సగటుతో 260 పరుగులు చేశాడు, ఇందులో మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. కాగా ఈ సిరీస్‌లో ఇంగ్లండ్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచిన స్టోక్స్ నాలుగు టెస్టుల్లో 25.24 సగటుతో 17 వికెట్లు తీసి టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నాడు. 34 ఏళ్ల స్టోక్స్ బ్యాటింగ్‌లో 43.43 సగటుతో 304 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ ప్రస్తుతం ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉంది.
భారత జట్టులో కూడా మార్పులు
ఇక భారత జట్టులో కూడా మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయి. రిషబ్ పంత్ కుడి పాదానికి గాయం కావడంతో ఐదో టెస్టుకు అతడు దూరమయ్యాడని BCCI అధికారికంగా ప్రకటించింది. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్ వికెట్ కీపర్‌గా ఆడటం దాదాపు ఖాయమేనని తెలుస్తోంది. బుమ్రా ఫిట్‌గా ఉన్నాడని, అయితే అతని వర్క్‌లోడ్‌ను పరిగణనలోకి తీసుకుని చివరి నిమిషంలో నిర్ణయం తీసుకుంటారని బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ తెలిపారు. బుమ్రాకు విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. గాయం నుంచి కోలుకున్న అర్ష్‌దీప్ సింగ్ ఐదో టెస్టులో అరంగేట్రం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం. నాలుగో టెస్టుకు గాయం కారణంగా దూరమైన ఆకాష్ దీప్ తిరిగి తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఓవల్ పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తే, కులదీప్ యాదవ్ కూడా తుది 11లో ఉండే అవకాశం ఉంది. ఈ సిరీస్‌లో అతనికి ఇంకా అవకాశం రాలేదు. పూర్తి జట్టుపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది. టీమ్ మేనేజ్‌మెంట్ మ్యాచ్ రోజు తుది నిర్ణయం తీసుకుంటుంది.
Also Read : WCL 2025: పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఢీ
ఇంగ్లండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జామీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జామీ ఓవర్టన్, జోష్ టంగ్యూ
england | india | ben-stokes | ind-vs-eng | latest-telugu-news | telugu-news | telugu-sports-news | telugu-cricket-news