BCCI: నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు దిగజారుడు వ్యాఖ్యలు.. శమాపై బీసీసీఐ సీరియస్ యాక్షన్!

కెప్టెన్ రోహిత్‌ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత శమా మహమ్మద్‌పై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. 'బాధ్యతాయుతమైన పదవిలో ఉండి పేరు ప్రచారం కోసం ఇంతకు దిగజారడం బాధాకరం. ఇలాంటి వ్యాఖ్యలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి' అంటూ ఫైర్ అయింది. 

New Update
bcci rohit

Bcci react on congress leader for fat shaming rohit sharma

BCCI: టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్‌ శర్మపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్‌ నేత శమా మహమ్మద్‌పై బీసీసీఐ ఘాటుగా స్పందించింది. ఛాంపియన్ ట్రోఫీలో భాగంగా సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లి కీలకమైన దశలో ఉన్న జట్టుపై ఇలాంటి కామెంట్స్ చేయడం సరైనది కాదని సూచించింది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఇలాంటి  దిగజారుడు మాటలు మాట్లాడటం దురదృష్టకరమని ఆగ్రహం వ్యక్తం చేసింది. 

దిగజారడం బాధాకరం..

'ఇలాంటి కామెంట్స్ వ్యక్తిగతంగా ఆటగాడిపై ప్రతికూల ప్రభావం చూపిస్తాయి. నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. తమ పేరు ప్రచారం కోసం ఇంతకు దిగజారడం నిజంగా బాధాకరం' అంటూ బీసీసీఐ బోర్డు పేర్కొంది. అయితే జనాలు దుమ్మెత్తిపోస్తున్న శమా మహమ్మద్‌ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ‘క్రీడాకారుడి ఫిట్‌నెస్‌ గురించి మాత్రమే సాధారణ ట్వీట్‌ చేశాను. అది బాడీ షేమింగ్‌ కాదు. ఆటగాళ్లు ఫిట్‌గా ఉండాలని కోరుకుంటాను. రోహిత్ ఓవర్‌ వెయిట్‌ ఉన్నాడని చెప్పారు. అంతేతప్ప తప్పుగా భావించలేదు. నాపై విమర్శల దాడులు చేయడం దారుణం. అతడిని గత కెప్టెన్లతో పోల్చాను. నాకు ఆ రైట్స్ ఉన్నాయి. అభిప్రాయం చెబితే తప్పేంటి. ఇది ప్రజాస్వామ్యం’ అంటూ మరోసారి రెచ్చిపోయారు. 

Also read : Hyderabad: చనిపోయిందా, చంపేశారా.. మిస్టరీగా మారిన శిరీష డెత్

అసలేం జరిగిందంటే..

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన  మ్యాచ్‌లో రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలు ఈ కామెంట్స్  చేశారు.  రోహిత్ శర్మ ఫ్యాట్ గా ఉంటాడని, బరువు తగ్గాలని ఆమె అన్నారు. రోహిత్ ఏదో లక్కీగా కెప్టెన్ అయ్యాడంటూ ఆమె చేసిన కామెంట్స్ రాజకీయ దూమరాన్ని రేపాయి. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడని షామా మొహమ్మద్ అభిప్రాయపడ్డారు. ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అతనేని ఆమె చెప్పుకోచ్చారు.  అయితే ఈ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలిచినప్పటికీ షామా తన పోస్టులో శర్మపై విమర్శలు గుప్పిస్తూ, రోహిత్ శర్మ లావుగా ఉన్నాడని  బరువు తగ్గాలని ఇండియన్ క్రికెట్ లో ఇప్పటివరకు అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ అని ఆమె కామెంట్ చేశారు.  

Also Read :  టన్నల్ విషయంలో హరీశ్ రావు రేవంత్ రెడ్డికి రాజీనామా సవాల్

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు