/rtv/media/media_files/2025/10/01/nakhvi-salman-2025-10-01-09-30-40.jpg)
అద్భుతమైన ఆట తీరులో టీమ్ ఇండియా ఆపియా కప్ ఉ తమ సొంతం చేసుకుంది. తొమ్మిదోసారి టైటిల్ ను గెలుచుకుంది. అయితే ఫైనల్స్ తరువాత పాక్ మంత్రి నఖ్వీ ఆసియా కప్ ను బహుకరిస్తుండడంతో దానిని మన క్రికెటర్లు నిరాకరించారు. ఇది గడిచి రెండు రోజులు గడుస్తూ ఈ వివాదం సద్దుమణగలేదు. ఫైనల్ వేడి ఇంకా చల్లారలేదు. దానికి కారణం కప్పు ఇంకా ఇండియా చేరకపోవడమే.
కెప్టెన్ వస్తే ఇస్తా..
భారత ఆటగాళ్ళు కప్పును తీసుకోవడానికి నిరాకరించడంతో పాక్ మంత్రి నఖ్వీ దానని తనతో పాటూ తీసుకెళ్ళిపోయారు. రెండు రోజులు గడిచినా దానిని తన దగ్గరే పెట్టుకుని ఇవ్వడం లేదు. ఇప్పటికే బీసీసీఐ కప్ ఇవ్వాలని పలుమార్లు అడిగింది. కానీ అతను మాత్రం ససేమిరా అంటున్నాడు. దానికి తోడు పనికిమాలిన కండిషన్లు పెడుతున్నాడు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన దగ్గరకు వస్తేనే కప్ ను ఇస్తానని డిమాండ్ చేస్తున్నాడని తెలుస్తోంది. దీనిపై బీసీసీఐ మం ిపడుతోంది. కప్ ఏమీ నఖ్వీ వ్యక్తిగత పోత్తు కాదని...ఆసియా క్రికెట్ కౌన్సిల్ ది అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దీంతో ఈ విషయంపై ఐసీసీకి ఫిర్యాదు చేయడానికి బీసీసీఐ సిద్ధమైంది. తన ఆఫీస్‌కు భారత సారథిని రప్పించి పైచేయి సాధించినట్లు ప్రగల్భాలు పలకడమే వారి ఉద్దేశమని అంటున్నారు.
ఉగ్రవాదులకు ఫీజులు..
మరోవైపు పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మీద కూడా బీసీసీఐ కంప్లైంట్ చేయాలనుకుంటోంది. ఆసియా కప్ మొదలైన దగ్గర నుంచీ ప్రతీ మ్యాచ్ లో పహల్గాం దాడిని గుర్తు చేసుకుంటున్నారు భారత క్రికెటర్లు. మొదటి మ్యాచ్ విజయాన్ని కెప్టెన్ సూర్యకుమార్ ఆ బాధితులకు అంకితం కూడా ఇచ్చాడు. దాంతో పాటూ ఫైనల్ మ్యాచ్ తరువాత ఆసియా కప్ ద్వారా తనకు వచ్చిన మొత్తాన్ని ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న భారత సైన్యానికి ఇచ్చేస్తున్నానని స్కై అనౌన్స్ చేశాడు.
దీని తరువాత పాక్ కెప్టెన్ సల్మాన్ ఆఘా కూడా ఒక ప్రకటన చేశాడు. తమ మ్యాచ్ ఫీజులను కూడా ఆపరేషన్ సిందూర్’ బాధితుల కుటుంబాలకు అందజేస్తామని చెప్పాడు. ఇప్పుడు ఇదే వివాదాలకు కారణం అయింది. పహల్గాం దాడి తర్వాత భారత సైన్యం పాకిస్తాన్ లో ఉన్న ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే దాడి చేసింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను మాత్రమే మట్టుబెట్టింది. పాకిస్తాన్ లో ప్రజల మీద అసలు దాడులే చేయలేదు. కానీ ఇప్పుడు సల్మాన్ ఆఘా ఆపరేషన్ సింధూర్ బాధితులకు తమ ఫీజును ఇస్తాను అంటున్నాడంటే..పరోక్షంగా ఉగ్రవాదులకు నిధులు అందజేయడమే కదా అని ఆరోపిస్తోంది బీసీసీఐ. అందుకే దీనిపై ఐసీసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకుంది.
Also Read: Philippiens: ఫిలిప్పీన్స్ లో పెరుగుతున్న భూకంపం డెత్ టోల్..31 చేరుకున్న మృతుల సంఖ్య