BCCI : పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ దిమ్మతిరిగే షాక్.. ఐసీసీకి సంచలన లేఖ!

పాక్తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని బీసీసీఐ వెల్లడించగా తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. ఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్‌లను ఒకే గ్రూపులో ఉంచకూడదని ఐసీసీని కోరింది. దీని కారణంగా భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ దశ మ్యాచ్‌లలో తలపడవు అన్నమాట.

New Update
bcci-and-pcb

bcci-and-pcb

ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడి దేశాన్ని తీవ్రంగా కలిచివేసింది. ఈ దాడిలో 26 మంది అమాయక టూరిస్టులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉగ్రదాడి ఘటన ఇండియా, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఎఫెక్ట్ క్రీడా రంగంపై కూడా పడింది.  ఇకపై పాక్ తో భారత్ ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడదని ఇప్పటికే బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించారు. తాజాగా బీసీసీఐ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి ఓ లేఖ రాసింది.

Also read :  నువ్వు చామనచాయ రంగులో ఉన్నావ్.. కొడుకు తెల్లగా ఎలా పుట్టాడని భర్త వేధింపులు.. చివరికి

BCCI Big Decision On Pakistan

బీసీసీఐ రాసిన లేఖలోఐసీసీ టోర్నమెంట్లలో భారత్, పాకిస్తాన్‌లను ఒకే గ్రూపులో ఉంచకూడదని ఐసీసీని కోరింది. దీని కారణంగా భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్ దశ మ్యాచ్‌లలో ఒకదానికొకటి తలపడవు అన్నమాట. అయితే దీని వల్ల పాకిస్తాన్ భారీ నష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే ఇండో-పాక్ మ్యాచ్‌ల ద్వారా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎక్కువ డబ్బు సంపాదిస్తుంది.

Also read :  కండక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి ప్రైవేట్ పార్ట్స్ తాకుతూ.. ఛీ ఛీ!

మరోవైపు మహిళల వన్డే ప్రపంచ కప్ దగ్గర పడింది. పాకిస్తాన్ కూడా దానికి అర్హత సాధించింది. కనీసం గ్రూప్ దశలోనైనా పాకిస్తాన్‌తో ఆడటానికి బీసీసీఐ ఇష్టపడటం లేదు.  ఇప్పుడు బీసీసీఐ రాసిన లేఖతో ఐసీసీ అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం గ్రూప్ దశలో కూడా ఇండియా- పాక్ మ్యాచ్ లు ఉండవు. కాగా  2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం టీం ఇండియా పాకిస్తాన్ వెళ్ళలేదు. అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లోనే ఆడింది. అటు పాక్ కూడా ఇండియాలో కూడా పర్యటించకూడదని నిర్ణయించుకుంది.  భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే అదే బోర్డు అమలు చేస్తుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా  వెల్లడించారు. 

Also read :  Supreme Court : రిపీటైతే తీవ్ర చర్యలుంటాయ్.. రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టు వార్నింగ్!

Also Read :  Fake 500 Note: ఫేక్ రూ.500 నోట్లను గుర్తించే గుర్తులు ఇవే.. అస్సలు మోసపోకండి!

 

pakistan | india | bcci | icc | ind-vs-pak | Pahalgam attack

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు