/rtv/media/media_files/2025/04/25/lGNF5tEqmFuu9kr99rCN.jpg)
jagityal married women
ఏడాది బాబు ఉన్న తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలోని జగిత్యాలలో చోటుచేసుకుంది. జగిత్యాల జిల్లాకు చెందిన ప్రసన్నలక్ష్మి(28), తిరుపతికి 2023లో పెళ్లి అయింది. ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. ఏడాది కిందట వీరికి బాబు పుట్టడంతో ప్రసన్న జాబ్ మానేసింది. దీంతో భర్త, అత్తింటివారు అదనపు కట్నం కోసం ప్రసన్నలక్ష్మిని వేధించారు. అంతేకాకుండా అయితే తిరుపతి, లక్ష్మి ప్రసన్న చామనచాయ రంగులో ఉంటే కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని అనుమానం పెంచుకొని తిరుపతి భార్యను నిత్యం వేధించేవాడు.
Also Read:Pahalgam Terror Attack: టార్గెట్ హైదరాబాద్.. ఆ ప్రాంతాలపైనే ఉగ్రవాదుల ఫోకస్!
కొడుకు తెల్లగా, అందంగా పుట్టాడని భార్యను వేధించిన టెక్కీ.. ఉరి వేసుకొని భార్య సూసైడ్
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2025
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోచమ్మవాడకు చెందిన లక్ష్మీ ప్రసన్న(29)కు, వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామానికి చెందిన తిరుపతికి రెండేళ్ల కిందట వివాహం అయింది
ఇద్దరూ బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా… pic.twitter.com/djj8uI6J7P
Also Read: కమ్ముకొస్తున్న యుద్ధ మేఘాలు.. LOC దగ్గర రాఫెల్ యుద్ధ విమానాలతో ఎక్స్‌ర్‌సైజ్ ఆక్రమన్
వేధింపులు తట్టుకోలేక
ఈ వేధింపులు తట్టుకోలేని ప్రసన్న ఇటీవల పుట్టింటికి వచ్చిన ఇంట్లోని అద్దంపై సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. తన కొడుకును అత్తమామలకు ఇవ్వకుండా మీరే జాగ్రత్తగా చూసుకోండి నాన్న అంటూ రాసింది. కాగా ఇటీవలే ప్రసన్నలక్ష్మి కుమారుడి మొదటి పుట్టినరోజు వేడుకలను సైతం గ్రాండ్ గా నిర్వహించారు. ఈరోజు దైవ దర్శనానికి తిరుపతి వెళ్లాల్సి ఉండగా తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ప్రసన్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమ కూతురు చావుకు భర్త, అత్తమామలే కారణమని లక్ష్మీ ప్రసన్న తండ్రి ఫిర్యాదు చేయగా, తిరుపతి అతని తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Also Read : VIRAL VIDEO: కండెక్టర్ కాదు కామాంధుడు.. బస్సులో నిద్రపోతున్న యువతి చెంకలో చెయ్యి పెడుతూ.. ఛీ ఛీ! (VIDEO)
Also Read : శృంగారం తర్వాత పురుషులకు తలెత్తే సమస్యలు ఇవే
telangana | karimnagar | jagitial | married women suicide | Prasanna Lakshmi