Ind vs Aus: రోహిత్‌‌ను కావాలనే తప్పించారు: ఆసీస్ మాజీ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు!

ఐదో టెస్టుకు రోహిత్ గైర్హాజరుపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రోహిత్‌కు విశ్రాంతి అని చెబుతున్నా అది తప్పించడమే అవుతుందని వ్యాఖ్యానించాడు. ఆ విషయాన్ని భారత మేనేజ్‌మెంట్ చెప్పడం లేదని పేర్కొన్నాడు.

New Update
Australian Former cricketer Mark Taylor

Australian Former cricketer Mark Taylor

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా సిడ్నీలో ఐదో (చివరి) టెస్టు  జరుగుతోంది. అయితే ఈ టెస్టుకు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరం కానున్నాడని గత నాలుగో మ్యాచ్ ఓటమి తర్వాత నుంచి వార్తలు జోరుగా సాగాయి. సిడ్నీలో జరగనున్న ఐదో టెస్టుకు రోహిత్ శర్మ ఆడే ఛాన్స్ లేదని.. అతడి స్థానంలో కెప్టెన్సీ బాధ్యతల్ని విరాట్ కోహ్లీకి అప్పగిస్తారని నెట్టింట చర్చ నడిచింది. 

Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్స‌ర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్

ముందుగానే ఊహాగానాలు

ఆసీస్‌తో జరిగిన గత నాలుగు టెస్టు మ్యాచ్‌ల్లోనూ రోహిత్ విఫలమయ్యాడు. ఏ మ్యాచ్‌లోనూ ఆశించినంతంగా రాణించలేకపోయాడు. దీంతో భారత్‌కు ఎంతో కీలకమైన ఐదో మ్యాచ్‌కు అతడు బెంచ్‌కే పరిమితమవుతాడని ఊహాగానాలు వ్యక్తం అయ్యాయి. ఇక అందరూ అనుకున్నట్లుగానే రోహిత్ శర్మ ఐదో టెస్టుకు దూరమయ్యాడు. 

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

అనుకున్నదే జరిగింది

అందరూ భావించినట్లుగానే అతడు బెంచ్‌కే పరిమితం అయ్యాడు. దీంతో ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ నడుస్తోంది. ఐదో టెస్టులో రోహిత్ శర్మకి బదులుగా బుమ్రా  టీమిండియా కెప్టెన్‌గా బాధ్యతలు వహిస్తున్నాడు. ఇందులో భాగంగానే టాస్ సమయంలో రోహిత్ ఆడకపోవడానికి గల కారణాన్ని బుమ్రా తెలిపాడు. ‘విశ్రాంతి’ పేరుతో రోహితే బెంచ్‌కి పరిమితమయ్యాడని చెప్పాడు. 

ఇది కూడా చదవండి: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్

కావాలనే తప్పించారు

ఇక రోహిత్ ఈ కీలకమైన మ్యాచ్‌కి దూరం కావడంపై ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ టేలర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్‌కు విశ్రాంతి అని చెబుతున్నా.. అది తప్పించడమే అవుతుందని మార్క్ టేలర్ వ్యాఖ్యానించారు. అదే సమయంలో భారత మేనేజ్‌మెంట్‌ తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 

Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్?

ఈ ఐదో టెస్టుకు రోహిత్ శర్మను తప్పించారనే తాను అనుకుంటున్నట్లు పేర్కొన్నారు. కాకపోతే భారత్‌కు ఎంతో కీలకమైన ఈ టెస్టు సమయంలో కెప్టెన్ విశ్రాంతి తీసుకోవడం ఎక్కడా జరగదని తెలిపారు. ఇది అత్యంత నిర్ణయాత్మకమైన టెస్టు మ్యాచ్. అందువల్లనే అతడిని తప్పించారు అని పేర్కొన్నారు. కానీ ఆ విషయం భారత మేనేజ్‌మెంట్ చెప్పడం లేదని.. ఇప్పుడు అతడు ఫామ్‌లో లేకపోవడం వల్లనే ఈ మ్యాచ్‌ను రోహిత్ మిస్ అయ్యాడని చెప్పుకొచ్చారు. క్రికెట్‌లో ఇది తప్పదు.. కానీ రోహిత్ విషయంలో ఇది అత్యంత దురదృష్టకరమని మార్క్ టేలర్ వ్యాఖ్యానించారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు