/rtv/media/media_files/2025/01/29/ZpFFpyX3NEmzTj6Bmcbu.jpg)
smith aus
Steve Smith: ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ స్టీవ్ స్మిత్ టెస్టుల్లో సరికొత్త ఘనత సాధించాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో సెంచరీ బాదిన స్మిత్ టెస్టుల్లో 35 శతకాలతో భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గావస్కర్ రికార్డ్ బ్రేక్ చేశాడు. మొత్తంగా 7వ స్థానంలో కొనసాగుతున్నాడు.
Test century number 35 for Australia’s talisman Steve Smith 🙌#WTC25 | #SLvAUS 📝: https://t.co/8NKpfnNf96pic.twitter.com/4Fs0arCu6o
— ICC (@ICC) January 29, 2025
ఒక్క పరుగుతో మూడు రికార్డులు..
అలాగే ఈ ఇన్నింగ్స్‌తో స్మిత్ టెస్టుల్లో 10,000 పరుగుల క్లబ్‌లో చేరాడు. ఆస్టేలియా తరఫున ఈ ఘనత సాధించిన 4వ బ్యాటర్‌గా నిలిచాడు స్మిత్. రికీ పాంటింగ్ (13,378), అలెన్ బోర్డర్ (11,174), స్టీవ్ వా (10,927) స్మిత్ కంటే ముందున్నారు. 205 ఇన్నింగ్స్‌ల్లో స్మిత్ 10 వేల పరుగులు చేయగా బ్రియాన్ లారా (195), సచిన్ తెందూల్కర్ (195), పాంటింగ్ (196) తర్వాత అత్యంత వేగంగా పదివేల పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డుల్లో కెక్కాడు. టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లలో సచిన్ (51), జాక్వెస్ కలిస్ (45), రికీ పాంటింగ్ (41), కుమార సంగక్కర (38), జో రూట్ (36), స్మిత్ 35 సెంచరీలతో 7వ స్థానంలో కొనసాగుతున్నారు.
There it is!
— 7Cricket (@7Cricket) January 29, 2025
Steve Smith is the fourth Australian to reach 10,000 Test runs 🙌#SLvAUSpic.twitter.com/06FLk8iqMI
ఇది కూడా చదవండి: ICC Rankings : నక్కతోక తొక్కాడు.. టాప్-5లోకి వరుణ్ చక్రవర్తి
ఇక ఈ టెస్టులో ఆస్ట్రేలియా భారీ స్కోరు దిశగా వెళ్తోంది. ఉస్మాన్ ఖవాజా 147 నాటౌట్ కు తోడు స్మిత్ 104 పరుగులు చేయడంతో తొలి రోజు ఆట ముగిసేసరికి ఆసీస్ 330 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ 57 రాణించాడు.