/rtv/media/media_files/2025/01/29/MToNT4hOshAnfPy1oCd0.jpg)
VarunChakravarthy Photograph: (VarunChakravarthy)
ICC Rankings : ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఆటగాడు వరుణ్ చక్రవర్తి అదరగొడుతన్నాడు. తాజాగా రాజ్‌కోట్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో కేవలం 24 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీశాడు. ఈ మ్యాచ్ లో టీమిండియా ఓడిపోయినప్పటికీ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా వరుణ్ చక్రవర్తి నిలిచాడు. సూపర్‌ఫామ్‌లో కొనసాగుతున్న వరుణ్ చక్రవర్తి ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కెరీర్‌లోనే అత్యుత్తమ ర్యాంకు సాధించాడు. 679 పాయింట్లతో ఏకంగా 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానంలో నిలిచాడు. మూడు మ్యాచ్‌లలో వరుణ్ చక్రవర్తి 7.08 ఎకానమీ రేట్‌తో 10 వికెట్లు పడగొట్టాడు.
Also Read: కుంభమేళాలో తొక్కిసలాట.. కన్నీరు పెట్టించే దృశ్యాలు..!
Varun Chakravarthy Climbs 25 Spots, Now Moves to No. 5 in ICC T20I Bowling Rankings.
— Akaran.A (@Akaran_1) January 29, 2025
- VARUN IS NOW THE HIGHEST-RANKED INDIAN BOWLER IN T20I! 🇮🇳🌟#VarunChakravarthy #ICCRankings #ICC #Cricket #INDvsENG pic.twitter.com/Cqd3u6uHhi
ఇంగ్లాండ్ స్పిన్నర్ ఆదిల్ రషీద్ బౌలర్లలో టాప్ లో కొనసాగుతున్నాడు. టీమిండియా ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. రవి బిష్ణోయ్ ఐదు స్థానాలు దిగజారి 10వ ర్యాంకుకు పడిపోయాడు. అక్షర్ పటేల్ ఐదు స్థానాలు మెరుగై 11వ ర్యాంకు దక్కించుకున్నాడు.ఇక బ్యాటర్ల విషయానికి వస్తే ఆసీస్ స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ టాప్ లో కొనసాగుతున్నాడు. తిలక్ వర్మ ఒక స్థానం మెరుగై రెండో ర్యాంకులో నిలిచాడు. ఇక సూర్యకుమార్ యాదవ్, జోస్ బట్లర్ వరుసగా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచారు.
ఐసీసీ టీ20 బౌలింగ్ ర్యాంకింగ్స్
ఆదిల్ రషీద్ - 718 రేటింగ్ పాయింట్లు
అకేల్ హోసేన్ - 707 రేటింగ్ పాయింట్లు
వనిందు హసరంగా - 698 రేటింగ్ పాయింట్లు
ఆడమ్ జంపా - 694 రేటింగ్ పాయింట్లు
వరుణ్ చక్రవర్తి – 679 రేటింగ్ పాయింట్లు (కెరీర్-బెస్ట్)
Also Read : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ హామీలు.. కాంగ్రెస్ సంచలన మేనిఫెస్టో
Also Read: మహా కుంభమేళాలో తొక్కిసలాట.. అమృత స్నానాలపై అఖండ పరిషత్ కీలక నిర్ణయం