T20 World Cup: శుభారంభం చేసిన ఆస్ట్రేలియా.. ఐర్లాండ్‌పై విజయం

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలిచింది.

New Update
Australia blow away Ireland with dominant show

Australia blow away Ireland with dominant show

టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో ఆస్ట్రేలియా మొదటి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 67 పరుగుల తేడాతో గెలిచింది. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్.. 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన ఐర్లాండ్‌ 16.5 ఓవర్లకే 115 పరుగులు చేసి ఆలౌవుట్ అయ్యింది. జార్జ్‌ డాక్రెల్‌ 29 బంతుల్లో 41 పరుగులు చేశారు. లోర్కాన్ టక్కర్ 24, రాస్‌ అడైర్ 12, మార్క్ అడైర్ 12 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు నాథన్ ఎల్లిస్ 4 వికెట్లు, ఆడమ్ జంపా 4 వికెట్లు తీశారు. కునెమన్‌ ఒక వికెట్‌ తీశారు.  

Also Read: టీ20 ప్రపంచ కప్.. దిగొచ్చిన పాకిస్తాన్

ఆస్ట్రేలియా బ్యాటర్లలో మార్కస్ స్టాయినిస్ 29 బంతుల్లో 45 పరుగులు చేశారు. జోష్ ఇంగ్లీస్ 17 బంతుల్లో 37, రెన్‌ షా 33 బంతుల్లో 37 పరుగులతో రాణించారు. కామెరూన్ గ్రీన్ (21), ట్రావిస్ హెడ్ (6), గ్లెన్ మ్యాక్స్‌వెల్(9) పరుగులు మాత్రమే చేశారు. ఐర్లాండ్‌ బౌలర్లలో మార్క్‌ అడైర్ రెండు వికెట్లు తీయగా.. మాథ్యూ హంఫ్రీస్, జార్జ్ డాక్రెల్, హ్యారీ టెక్టర్ ఒక్కో వికెట్ పడగొట్టారు.  

Also Read: బంగ్లాదేశ్‌లో రేపే ఎన్నికలు.. గెలిచేది ఆ పార్టీయే !

Advertisment
తాజా కథనాలు