Asia Cup 2025: టీమిండియా ఆసియా కప్ గెలిస్తే.. ప్రైజ్ మనీ కింద ఎన్ని కోట్లు వస్తాయో తెలుసా?

ఆసియా కప్ 2025లో గెలిచిన జట్టు రూ.2.6 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. రన్నరప్‌ జట్టుకు అయితే రూ.1.3 కోట్లు ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

New Update
Asia Cup

Asia Cup 2025

ఆసియా కప్ 2025 సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఎనిమిది జట్లు ఈ టోర్నీలో పోటీపడనున్నాయి. దుబాయ్ వేదికగా ప్రారంభం కానున్న ఈ టోర్నీలో రెండు 8 జట్లును రెండు గ్రూపులుగా విభజించనున్నారు. టీ20 ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. యూఏఈతో పాటు భారత్, శ్రీలంక, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, హాంగ్ కాంగ్, ఆఫ్గానిస్తాన్ జట్లు ఈ టోర్నీలో తలపడనున్నాయి. గ్రూప్ ఏ లో యూఏఈ, పాకిస్తాన్, ఒమన్, భారత్ ఉన్నాయి. లీగ్ దశలో జట్టు ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. టాప్ 2లో ఉన్న జట్లు సూపర్ 4కు వెళ్తాయి. మళ్లీ నాలుగు జట్లు ఒకసారి తలపడతాయి. టాప్ 2లో ఉన్న జట్లు ఫైనల్‌కు చేరుతాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి సెప్టెంబర్ 28వ తేదీ వరకు జరగనుంది. ఈ టోర్నీలో గెలిచిన జట్టు రూ.2.6 కోట్ల ప్రైజ్‌మనీ అందుకోనున్నట్లు తెలుస్తోంది. రన్నరప్‌ జట్టుకు అయితే రూ.1.3 కోట్లు ఇవ్వనున్నారు. గతంలో ఈ టోర్నీలో గెలిచిన జట్టుకు రూ.1.6 కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఆ ప్రైజ్‌మనిని భారీగా పెంచారు. మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నవారికి కూడా భారీగానే ప్రైజ్‌మనీ ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

ఇది కూడా చూడండి: BIG BREAKING: మాజీ స్టార్ క్రికెటర్‌కు ఈడీ సమన్లు

ఇదిలా ఉండగా ఈసారి టీమిండియా బ్లాంక్ జెర్సీలతోనే బరిలోకి దిగనుంది. దీనికి కారణం పార్లమెంట్‌లో ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు ఆమోదం పొందడంతో టీమిండియాకు ప్రధాన స్పాన్సర్‌గా ఉన్న డ్రీమ్ 11 ఒప్పందం రద్దు చేసుకోవడమే. దీంతో ఇప్పుడు టీమిండియాకు కొత్త స్పాన్సర్‌ లేదు. అయితే బీసీసీఐ టీమిండియా కొత్త స్పాన్సర్‌ కోసం ఎదురు చూస్తోంది.  నిజానికి డ్రీమ్ 11 బీసీసీఐతో చేసుకున్న ఒప్పందం ప్రకారం 2026 వరకు కొనసాగాల్సింది. కానీ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడంతో ఒప్పందంలో మధ్యలోనే రద్దు చేసుకుంది. దీంతో స్పాన్సర్‌షిప్ లేకుండా టీమిండియా ఆసియా కప్ ఆడనుంది.

ఆసియా కప్  జట్టు

సూర్య కుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్ (వైస్ కెప్టెన్)తో పాటు అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్ దీప్ సింగ్, సంజు శాంసన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్ వంటి కీలక ఆటగాళ్లు ఈ జట్టులో ఉన్నారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంకాంగ్, ఒమన్  మొత్తం ఎనిమిది జట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి. సెప్టెంబర్ 9వ తేదీ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా ఈ టోర్నీ ప్రారంభం కానుంది. 

ఇది కూడా చూడండి: Amit Mishra: క్రికెట్ కు అమిత్ మిశ్రా గుడ్ బై!

Advertisment
తాజా కథనాలు