World Championship: వరల్డ్ ఛాంపియన్ షిప్ స్పీడ్ స్కేటింగ్ లో రెండు బంగారు పతకాలు..

వరల్డ్ ఛాంపియన్ షిప్ లో భారత్ కు మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ లో ఆనంద్ కుమార్, జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్ లో క్రిష్ శర్మ పతకాలు సాధించారు.

New Update
skating

చైనాలో జరుగుతున్న ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత అథ్లెట్లు వరుస స్వర్ణాలతో అదరగొడుతున్నారు. తాజాగా నిన్న మరో రెండు స్వర్ణ పతకాలు వచ్చాయి. స్కేటింగ్ లో ఇండియాకు మొట్టమొదటి సారిగా టైటిల్ వచ్చింది. సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌లో ఆనంద్‌కుమార్ వెల్ కుమార్ భారత్ తరపున మొట్టమొదటి ప్రపంచ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. 22 ఏళ్ల ఈ స్పీడ్‌స్టర్ సీనియర్ పురుషుల 1000 మీటర్ల స్ప్రింట్‌లో 1:24.924 సమయంతో విజయం సాధించి, ఈ క్రీడలో భారతదేశపు తొలి ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచాడు. అంతకు ముందు 500 మీటర్ల స్ప్రింట్ లో వెల్ కుమార్ కాంస్యం సాధించాడు. 43.072 సెకన్లలో పూర్తి చేసి భారతదేశం యొక్క మొట్టమొదటి సీనియర్ వరల్డ్స్ పతకాన్ని గెలుచుకున్నాడు.

500మీటర్ల స్ప్రింట్ లో కూడా..

మరోవైపు జూనియర్ 1000 మీటర్ల స్ప్రింట్‌లోక్రిష్ శర్మ కూడా స్వర్ణం సాధించాడు. దీంతో ఛాంపియన్‌షిప్‌లలో భారతదేశం తరపున అద్భుతమైన డబుల్‌ను పూర్తి చేశాడు. ఈ ఏడాది ప్రారంభంలో చెంగ్డులో జరిగిన ప్రపంచ క్రీడల్లో కూడా క్రిష్ కాంస్యం సాధించాడు.

Also Read: TIK TOK: అమెరికాకు మళ్ళీ టిక్ టాక్..యువత ఆనందంగా ఉంటారన్న ట్రంప్

Advertisment
తాజా కథనాలు