ఆసియాకప్ విజయం.. టీమ్ ఇండియాకు BCCI భారీ నజరానా!

ఆసియాకప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్‌ స్టాఫ్‌కు కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నట్లు తెలిపింది.

New Update
bcciiii

BCCI: ఆసియాకప్‌ విజేతగా నిలిచిన టీమ్‌ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్‌ స్టాఫ్‌కు కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నట్లు తెలిపింది. పాకిస్తాన్‌ను ఓడించి భారత్ తొమ్మిదవసారి ఆసియా కప్ టైటిల్‌ను గెలుచుకున్న టీమ్ ఇండియా విజయానికి గుర్తింపుగా ఈ బహుమతి ఇస్తున్నట్లు వెల్లడించింది. 

Also Read: తెలుగులో మాట్లాడు..? కాంతార హీరోపై నెటిజన్స్ ఫైర్

3 షాక్‌లు.. 0 స్పందన..

ఈ మేరకు భారత జట్టు విజయం సాధించిన తర్వాత BCCI ఇన్‌స్టాగ్రామ్‌లో టీమ్ ఇండియా ఫోటోను పోస్ట్ చేస్తూ.. '3 షాక్‌లు.. 0 స్పందన. ఆసియా కప్ ఛాంపియన్‌ సందేశం అందిరింది. జట్టు, సహాయక సిబ్బందికి రూ.21 కోట్ల ప్రైజ్ మనీ' అంటూ రాసుకొచ్చింది. అలాగే ఈ సందర్భంగా ఈ ఆసియా కప్‌లో భారత్ పాకిస్థాన్‌ను మూడుసార్లు ఓడించిందని BCCI గుర్తు చేసింది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌ను వరుసగా మూడోసారి ఓడించిన భారత్.. ఫైనల్లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆసియా కప్ ట్రోఫీని ముద్దాడింది. పాకిస్తాన్‌పై విజయం తర్వాత దేశంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ ఆసియా కప్‌ లీగ్‌లో మొదట, ఆపై సూపర్ ఫోర్‌లో పాక్ ను భారత్ చిత్తుగా ఓడించింది. ఫైనల్‌లో కూడా వారిని ఓడించి హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. 

Also Read: అక్కడ రికార్డు బ్రేక్.. దుమ్ము రేపుతోన్న 'మిరాయ్' కలెక్షన్స్

విజయానికి 147 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ తొలి ఐదు ఓవర్లలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పేలవమైన ఆరంభాన్ని సాధించింది. ఆ తర్వాత తిలక్ బాధ్యత తీసుకుని 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులు చేశాడు. సంజు సామ్సన్ (24), శివమ్ దుబే (21 బంతుల్లో 33) కూడా మద్దతు ఇచ్చారు. ఇక కుల్దీప్ యాదవ్ 4 వికెట్లు తీసి పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టాడు. 19.1 ఓవర్లలో 146 పరుగులకు పాక్ ఆలౌట్ అయింది.

Advertisment
తాజా కథనాలు