/rtv/media/media_files/2025/08/15/modi-trump-tariffs-2025-08-15-10-38-14.jpg)
PM Modi On Trump Tariffs
ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు. ఆపరేషన్ సింధూర్ గ్రౌండ్‌లో కూడా విజయవంతమైంది. రెండీట్లో ఫలితం ఒక్కటే.. భారత్ విజయం సాధించింది! మన క్రికెటర్లకు అభినందనలు" అని 'X'లో పోస్ట్ చేశారు.
#OperationSindoor on the games field.
— Narendra Modi (@narendramodi) September 28, 2025
Outcome is the same - India wins!
Congrats to our cricketers.
ప్రధాని మోడీ తన ట్వీట్‌లో ప్రస్తావించిన 'ఆపరేషన్ సింధూర్' సైనిక ఆపరేషన్. జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సింధూర్ నిర్వహించాయి. ఈ ఆపరేషన్ పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై టార్గెట్‌గా చేసింది.
పాకిస్తాన్‌పై గ్రౌండ్‌లో ఆసియా కప్ గెలవడాన్ని 'ఆపరేషన్ సింధూర్' విజయంతో పోల్చి ప్రధాని మోడీ ఓ బలమైన సందేశాన్ని పంపారు. క్రీడా రంగంలో లేదా రక్షణ రంగంలో... ఏ పోటీలోనైనా భారత్ తన ఆధిపత్యాన్ని నిరూపించుకోగలదనే గట్టి సంకల్పాన్ని ఆయన వ్యక్తం చేశారు.
దుబాయ్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన ఈ ఫైనల్ మ్యాచ్‌లో, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలో యువ ఆటగాడు తిలక్ వర్మ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో రాణించి, చివరి ఓవర్‌లో భారత్‌కు విజయాన్ని అందించాడు. భారత స్పిన్నర్లు ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ (4 వికెట్లు) పాక్ బ్యాటింగ్ లైనప్‌ను కుప్పకూల్చారు. ఈ గెలుపుతో భారత్ రికార్డు స్థాయిలో తొమ్మిదోసారి ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఈ చారిత్రక విజయాన్ని ప్రధాని మోడీ తన ప్రత్యేక శైలిలో అభినందించడం ద్వారా దేశవ్యాప్తంగా సంబరాలు మిన్నంటాయి.