RGV: మరో వివాదంలో RGV.. కియారా బికినీ లుక్ పై వల్గర్ పోస్ట్! తిట్టిపోస్తున్న నెటిజన్లు

డైరెక్టర్ RGV మరో వివాదంలో చిక్కుకున్నారు. వార్ 2 టీజర్ లో కియారా అద్వానీ బికినీ లుక్ పై ఆయన చేసిన పోస్ట్ వివాదాస్పదమైంది. కియారా బ్యాక్ చూపించే స్టిల్‌ను షేర్ చేస్తూ ''హృతిక్, NTR యుద్ధం దేశాల కోసం కాదు కియారా కోసం అయితే బ్లాక్ బస్టర్ అవుతుంది'' అని పెట్టారు.

New Update

RGV:  దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తన వివాదాస్పద పోస్టులతో తరచు వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా  'వార్ 2' టీజర్ లో కియారా అద్వానీ బికినీ లుక్ పై ఆయన చేసిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది.  

అభ్యంతరకర పోస్ట్

కియారా బ్యాక్ చూపించే స్టైల్ షేర్ చేస్తూ.. ''హృతిక్  ఎన్టీఆర్ మధ్య యుద్ధం దేశాల కోసం కాదు… కియారా కోసం అయితే ‘బంపర్ బ్లాక్ బస్టర్’ అవుతుంది'' అంటూ అభ్యంతరకర పోస్ట్ పెట్టారు. ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెలువెత్తాయి. ఒక మహిళ గురించి ఇలా మాట్లాడడాన్ని ఖండించారు.  “ఇలాంటి వ్యక్తులు పబ్లిక్ ఫిగర్‌గా ఉండటమే విచారకరం” అంటూ RGV పై మండిపడ్డారు.  దీంతో ఆర్జీవీ  బుధవారం ఉదయం తన పోస్ట్‌ను సైలెంట్ గా తొలగించారు.

RGV post on Kiara look
RGV post on Kiara look

ఆగస్టు 15న.. 

ఇదిలా ఉంటే వార్ 2 టీజర్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. టీజర్‌లో హృతిక్ రోషన్ (కబీర్) , జూనియర్ ఎన్టీఆర్ మధ్య యాక్షన్ క్లాష్‌ అభిమానులను ఫిదా చేసింది. మరోవైపు   గ్లామరస్ బికినీ లుక్  ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.  ఆమె లుక్, ఫిజిక్ , స్క్రీన్ ప్రెజెన్స్‌ ఎంతో అందంగా కనిపించింది. ఇందులో కియారా హృతిక్‌తో రొమాంటిక్ జోడీగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. తెరపై బికినీలో కనిపించడం ఇదే తొలిసారని కియారా స్వయంగా తన సోషల్ మీడియా పోస్ట్ లో తెలిపారు. 

అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని.. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించింది. 2019లో విడుదలైన సూపర్ హిట్ యాక్షన్ అడ్వెంచర్ వార్ 1 సీక్వెల్ గా 'వార్ 2' ను రూపొందించారు.  వార్ 2 ఆగస్టు 15న థియేటర్స్ లో విడుదల కానుంది. 

cinema-news | latest-news | war-2 | kiara-advani 

Also Read:Miss world 2025: పొలాల నుంచి ప్రపంచ వేదిక వరకు.. మిస్ ఇండియా నందిని స్పీచ్‌కు ప్రపంచం స్టాండింగ్ ఓవేషన్!

Advertisment
తాజా కథనాలు