Anant Ambani: మెస్సికి అనంత్‌ అంబానీ ఇచ్చిన గిఫ్ట్‌ గురించి తెలిస్తే షాక్!

ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సి సందర్శించారు. మెస్సికి అనంత్‌ అంబానీ రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

New Update
Anant Ambani Gifts Messi

అర్జెంటీనా(argentina) ఫుట్‌బాల్ స్టార్ ప్లేయ‌ర్(football-player) లియోన‌ల్ మెస్సి(Messi Football Match) తన గోట్ ఇండియా టూర్‌‌లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌ను సందర్శించిన విషయం తెలిసిందే. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ(anant-ambani) స్థాపించిన వన్యప్రాణుల సంరక్షణ, పునరావాసం, పరిరక్షణ కేంద్రం అయిన వంతారాను మెస్సీ సందర్శించారు. అక్కడ జంతువులతో మెస్సి సరదాగా సమయాన్ని గడిపారు. వంతారాను విజిట్‌ చేసిన మెస్సి(Lionel Messi)కి అనంత్‌ అంబానీ అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చారు. తన గుర్తుగా రిచర్డ్‌ మిల్లె వాచ్‌ని ఫుట్‌బాల్‌ స్టార్‌కు బహుమతిగా ఇచ్చారు.

Also Read :  మోదీ పర్యటనలో.. ఇండియా-జోర్డాన్‌‌ 5 కీలక ఒప్పందాలు ఇవే!

Anant Ambani Gifts Messi

వంతారా సందర్శనకు వెళ్లేటప్పుడు మెస్సి చేతికి ఎలాంటి వాచ్‌ లేదు. అనంత్‌తో మీటింగ్‌ తర్వాత అతడి చేతిపై ఓ అరుదైన, అత్యంత ఖరీదైన గడియారం దర్శనమిచ్చింది. ఆ వాచ్‌ రిచర్డ్ మిల్లె RM 003-V2 GMT టూర్‌ బిల్లాన్ ఆసియా ఎడిషన్. ఇలాంటివి ప్రపంచంలో కేవలం 12 పీస్‌లు మాత్రమే ఉంటాయి. దీని ధర దాదాపు 1.2 మిలియన్‌ డాలర్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. అంటే మన భారత కరెన్సీలో దాదాపు రూ. 10.91 కోట్లు. ఈ గడియారాన్ని అనంత్ అంబానీ మెస్సికి బహుమతిగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక అనంత్‌ అంబానీ సైతం ఇలాంటి మరోవాచ్‌ను ధరించడం విశేషం. రిచర్డ్ మిల్లె RM 056 సఫైర్ టూర్‌బిల్లాన్‌ అనంత్‌ చేతికి కనిపించింది. దీని విలువ దాదాపు దాదాపు 5 మిలియన్‌ డాలర్లుగా తెలుస్తోంది. అంటే రూ.45.59 కోట్లన్నమాట. ప్రస్తుతం ఈ న్యూస్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.

Also Read :  అసలు లక్ష, వడ్డీ రూ.73 లక్షలు.. కిడ్నీ అమ్మి అప్పు తీర్చిన రైతు

Advertisment
తాజా కథనాలు