/rtv/media/media_files/2025/07/07/new-project-2025-07-07-14-36-34.jpg)
ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను ఓడించి టీమ్ ఇండియా చరిత్ర సృష్టించింది. 58 ఏళ్ల చరిత్రలో ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్ సాధించిన తొలి టెస్ట్ విజయం ఇదే కావడం విశేషం. శుభమాన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లాండ్‌ను 336 పరుగుల తేడాతో ఓడించింది. దీనితో, భారత్ 5 మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. భారత్ తరఫున ఈ విజయంలో, గిల్, జడేజా, జైస్వాల్, పంత్ కెఎల్ రాహుల్ బ్యాటింగ్‌తో అద్భుతంగా రాణించగా, మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ బౌలింగ్‌తో మెరిశారు. ఆకాష్ దీప్ రెండవ ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు మరియు మొదటి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు సహా మొత్తం 10 వికెట్లు తీసి విజయానికి హీరోగా నిలిచాడు. అయితే ఈ మ్యాచ్‌కు ముందు ఆకాష్ దీప్ పేరు కూడా ఎక్కడా కూడా వినిపించలేదు.
Also Read : తిరుమల భక్తులకు అదిరిపోయే శుభవార్త.. అన్న ప్రసాదంలో మరో ఐటెం.. ఏంటో తెలుసా?
Also Read : బీజాపూర్ లో ఎన్‌కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి
అర్ష్‌దీప్ , కుల్దీప్ యాదవ్‌లను తీసుకోవాలని
అసలు అతన్ని జట్టులోకి తీసుకుంటారని కూడా ఏ ఒక్కరు ఊహించలేదు. రెండో టెస్ట్‌లో బుమ్రాను భారత్ ఆడించదని నిర్ణయించినప్పుడు మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు అతని స్థానంలో అర్ష్‌దీప్ సింగ్ లేదా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లను ఆడించాలని సూచించారు. సునీల్ గవాస్కర్, మైఖేల్ క్లార్క్, రవిశాస్త్రి, ఆరోన్ ఫించ్ వంటి పలువురు మాజీ క్రికెటర్లు కూడా ఇదే సలహా ఇచ్చారు. ఏ ఒక్కరు కూడా అతని ప్రతిభను అంచనా వేయలేకపోయారు. కానీ హెడ్ కోచ్ గంభీర్ మాత్రం వేరే లెక్క వేసాడు. రెండో వ టెస్ట్‌లో ఆకాష్ దీప్‌కు అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడు. ఆకాష్ దీప్ కూడా తన ఎంపికకు న్యాయం చేశాడు. ఇంగ్లాండ్ తన తొలి ఇన్నింగ్స్‌ను ప్రారంభించగానే, గత మ్యాచ్‌లో సెంచరీలు సాధించిన ఓలీ పోప్, బెన్ డకెట్‌లను ఇన్నింగ్స్‌లోని 2వ ఓవర్‌లోనే అవుట్ చేశాడు. మొత్తం మ్యాచ్ లో పది వికెట్లు తీసి ఇండియా విక్టరీలో కీ రోల్ పోషించాడు.
Also Read : అయ్యో బిడ్డా.. తెలంగాణలో ప్రాణం తీసిన ఫ్యాన్.. 9 ఏళ్ల చిన్నారి మృతి
Akash Deep | ind-vs-eng | IND VS ENG 2ND TEST | IND VS ENG TEST SERIES 2025 | Shubman Gill