/rtv/media/media_files/2025/07/07/ttd-anna-prasadam-new-menu-2025-07-07-16-13-00.jpg)
/rtv/media/media_files/2025/07/07/ttd-anna-prasadam-1-2025-07-07-16-04-20.jpg)
తిరుమల వచ్చే భక్తులకు టీటీడీ మరో శుభవార్త చెప్పింది. ఇప్పటికే తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో భక్తులకు అందించే అన్నప్రసాదంలో మరో ఐటెంను పెంచింది. ఇప్పటివరకు అన్న ప్రసాదంలో పగలు మాత్రమే భక్తులకు వడలు అందించేవారు.
/rtv/media/media_files/2025/07/07/ttd-anna-prasadam-2-2025-07-07-16-04-20.jpg)
అయితే.. ఇకపై రాత్రి పూట నిర్వహించే అన్నప్రసాద పంపిణీలోనూ వడలు వడ్డించనున్నట్లు తెలిపింది. ప్రస్తుతం రోజుకు సుమారు 70 వేల నుండి 75 వేల వడలను ప్రత్యేకంగా తయారు చేసి భక్తులకు వడ్డిస్తున్నారు.
/rtv/media/media_files/2025/07/07/ttd-anna-prasadam-3-2025-07-07-16-04-20.jpg)
తాజా నిర్ణయంతో ఈ సంఖ్యను భారీగా పెంచనున్నారు. ప్రతీ రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అన్నప్రసాదంలో భక్తులకు వడలు అందించనున్నారు.
/rtv/media/media_files/2025/07/07/ttd-anna-prasadam-2025-07-07-16-04-21.jpg)
నిన్న టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ వడల పంపిణీ కార్యక్రమాన్ని బోర్డు సభ్యులు శాంతా రామ్, డిప్యూటీ ఈవో రాజేంద్ర, క్యాటరింగ్ ప్రత్యేక అధికారి శాస్త్రి, ఇతర అధికారులు పాల్గొన్నారు.