India vs Newzeland: మరికాసేపట్లో మ్యాచ్.. అహ్మదాబాద్ స్టేడియంలో భారీ భద్రత

మరికాసెపట్లో అహ్మదాబాద్‌ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్‌ కోసం స్టేడియం వద్ద పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, హోం గార్డులతో కలిపి మొత్తం 4500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు.

New Update
Ahmedabad Police Deploys Extensive Security for T20 World Cup Final

Ahmedabad Police Deploys Extensive Security for T20 World Cup Final

మరికాసెపట్లో అహ్మదాబాద్‌ వేదికగా ఐసీసీ టీ20 వరల్డ్ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ జరగనుంది. టీమిండియా, న్యూజిలాండ్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌కోసం దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియం ప్రేక్షకులతో నిండిపోయింది. మరోవైపు టీమిండియా కూడా హోటల్ నుంచి స్టేడియానికి బయలుదేరింది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు అభిమానులు హోటల్ బయట భారీగా తరలివచ్చారు. 

Also Read: టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ .. గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. ICC అదిరిపోయే ఆఫర్!

ఫైనల్ మ్యాచ్‌ కోసం అహ్మదాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పోలీసులు, హోం గార్డులతో కలిపి మొత్తం 4500 మందికి పైగా సిబ్బందిని మోహరించారు. అలాగే స్టేడియం లోపల మూడంచెల సెక్యూరిటీ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. బాంబు స్క్వాడ్‌తో సహా యాంటీ డ్రోన్ బృందాలను కూడా బరిలోకి దింపారు. 

Also read: ఫైనల్స్ వేళ టీమిండియాకు బిగ్ షాక్.. కెప్టెన్ సూర్య రిటైర్మెంట్?

ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్టేడియం లోపలికి వెళ్లేందుకు ప్రత్యేక ఛానెళ్లు, హోల్డింగ్ ఏరియాలను ఏర్పాటు చేశారు. తొలసారిగా టీమిండియా ధోని సారథ్యంలో టీ20 వరల్డ్‌ కప్‌ను గెలిచింది. రెండోసారి 2024లో రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో కప్‌ సాధించింది. మూడోసారి కూడా వరల్డ్‌ కప్‌ను ముద్దాడాలని టీమిండియా గట్టి పట్టుదలతో ఉంది. మరోవైపు న్యూజిలాండ్‌ కూడా కప్‌ను దక్కించుకుకోవాలని చూస్తోంది. 

Advertisment
తాజా కథనాలు