ICC T20 World Cup 2026 : టీ20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ .. గెలిచిన జట్టుపై కాసుల వర్షం.. ICC అదిరిపోయే ఆఫర్!

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. కాసేపట్లో అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం 'నరేంద్ర మోడీ స్టేడియం'లో

New Update
icc

క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 క్లైమాక్స్‌కు చేరుకుంది. కాసేపట్లో అహ్మదాబాద్‌లోని ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియం 'నరేంద్ర మోడీ స్టేడియం'లో టీమ్ ఇండియా, న్యూజిలాండ్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌ను 7 పరుగుల తేడాతో ఓడించి భారత్ ఫైనల్ చేరగా, సౌతాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తు చేసి కివీస్ ఫైనల్‌కు దూసుకొచ్చింది. భారత్ వరుసగా రెండోసారి కప్పు కొట్టాలని చూస్తుంటే.. న్యూజిలాండ్ తొలిసారి టీ20 ట్రోఫీని ముద్దాడాలని పట్టుదలగా ఉంది. అయితే గెలిచిన జట్టుకు ఎంత ప్రైజ్ మనీ ఉంటుందో అని ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

ప్రైజ్ మనీ ఎంతంటే?

ఈసారి ఐసీసీ గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ప్రైజ్ మనీని ప్రకటించింది. మొత్తం ప్రైజ్ పూల్ విలువ సుమారు రూ. 123 కోట్లు ($13.5 మిలియన్లు).  వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు దాదాపు రూ. 27.50 కోట్లు దక్కుతాయి.  ఫైనల్లో ఓడిన జట్టుకు కూడా భారీగానే రూ. 14.67 కోట్లు అందుతాయి.మరోవైపు సెమీస్‌లో ఓడిపోయిన ఇంగ్లాండ్, సౌతాఫ్రికా జట్లకు ఒక్కొక్కరికి రూ. 7.24 కోట్లు లభిస్తాయి.  పాకిస్థాన్ వంటి సూపర్-8 వరకు వచ్చి ఆగిపోయిన జట్లకు సుమారు రూ. 3.48 కోట్లు అందుతాయి. కనీసం గ్రూప్ స్టేజ్‌లో ఆడిన జట్లకు కూడా రూ. 2.29 కోట్లు ఐసీసీ కేటాయించింది. గత 2024 వరల్డ్ కప్‌తో పోలిస్తే ఈసారి ప్రైజ్ మనీని 20 శాతం పెంచడం విశేషం. మరి ఈ రికార్డ్ స్థాయి ఇనాముతో పాటు ఆ మెరిసే ట్రోఫీని రోహిత్ సేన మళ్ళీ ముద్దాడుతుందో లేదో చూడాలి!

ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఈసారి పిచ్‌ను ఎర్ర మట్టి తో సిద్ధం చేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ లాగా ఇది స్లోగా ఉండదు. బంతి బ్యాట్‌పైకి బాగా వస్తుంది కాబట్టి, భారీ స్కోర్లు (200-210 పరుగులు) నమోదయ్యే అవకాశం ఉంది. అయితే, రాత్రిపూట మంచు (Dew Factor) కురిసే అవకాశం ఉండటంతో, టాస్ గెలిచిన జట్టు మొదట ఫీల్డింగ్ ఎంచుకునే ఛాన్స్ ఉంది. భారత్, న్యూజిలాండ్ ఇప్పటివరకు టీ20ల్లో 30 సార్లు తలపడ్డాయి. ఇందులో భారత్ 18 సార్లు గెలవగా, న్యూజిలాండ్ 11 సార్లు విజయం సాధించింది (ఒకటి టై అయ్యింది). అహ్మదాబాద్‌లో భారత్‌కు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన 10 మ్యాచ్‌ల్లో టీమ్ ఇండియా 7 సార్లు గెలిచింది. ఒకవేళ భారత్ గెలిస్తే, టీ20 వరల్డ్ కప్ చరిత్రలో మూడుసార్లు టైటిల్ నెగ్గిన ఏకైక జట్టుగా, అలాగే వరుసగా రెండుసార్లు (డిఫెండింగ్ ఛాంపియన్) నెగ్గిన టీమ్‌గా చరిత్ర సృష్టిస్తుంది.

Advertisment
తాజా కథనాలు