Porel: అదెం కొట్టుడు రా సామీ.. పొరెల్ పరుగుల వరద- ఒకే ఓవర్‌లో 4, 4, 6, 4, 4

రాజస్తాన్ రాయల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో అభిషేక్ పొరెల్ దుమ్ము దులిపేశాడు. ఒక్క ఓవర్‌లో 23 పరుగులు రాబట్టాడు. దేష్ పాండే వేసిన 2వ ఓవర్‌లో వరుసగా 4, 4, 6, 4, 4, 1 పరుగులు వచ్చాయి. అతడు ఇంకా దూకుడుగా ఆడుతున్నాడు.

New Update
Abishek Porel smashed 23 off the second over by Tushar Deshpande

Abishek Porel smashed 23 off the second over by Tushar Deshpande

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ ఎడిషన్ అత్యంత రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగానే ఇవాళ ఢిల్లీ క్యాపిటల్స్ vs రాజస్తాన్ రాయల్స్ మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరుగుతోంది. అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. మొదట టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో  ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు బ్యాటింగ్‌కు దిగింది. 

Also Read: భారీ యాక్షన్ అడ్వెంచర్‌కు సిద్ధమైన కమల్ హాసన్

ఓపెనర్స్‌గా జేక్ ఫ్రేజర్, అభిషేక్ పొరెల్ వచ్చారు. ఈ ఇద్దరూ మొదటి నుంచి దూకుడుగా ఆడటం ప్రారంభించారు. వరుసగా ఫోర్లు, సిక్సర్లు బాదారు. ఇలా ఆర్చర్ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి. అయితే రెండో ఓవర్‌లో మాత్రం పొరెల్ బంతిని ఉతికారేశాడు. తుషార్ దేశ్‌పాండే వేసిన రెండో ఓవర్‌లో పొరెల్ దుమ్ము దులిపేశాడు. 

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

ఉతికారేశాడు

వరుసగా ఫోర్లు, సిక్సర్ రాబడుతూ పరుగుల వరద పెట్టించాడు. ఈ రెండో ఓవర్‌లో మొత్తం 23 పరుగులు వచ్చాయి. వరుసగా 4, 4, 6, 4, 4, 1 బాదేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు పొరెల్. దీంతో ఢిల్లీ స్కోర్ 2 ఓవర్లకు 33 పరుగులు చేసింది. అంతలోనే ఢిల్లీ జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఓపెనర్ జేక్ ఫ్రేజర్ (9) ఔటయ్యాడు.

Also Read: ఇంట్లో శివలింగం ఏ దిశలో ఉంచాలంటే?: శివభక్తులు తప్పక తెలుసుకోవాల్సిన 5 విషయాలు!

IPL 2025 | dc-vs-rr | IPL 2025 DC vs RR Live Score | latest-telugu-news | telugu-news

Also Read: 10 వేల ఏళ్ల క్రితం అంతరించిపోయిన తోడేళ్లు మళ్లీ తిరిగొస్తున్నాయ్..!!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు