Assembly Budget Sessions:తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఆరవ రోజుకు చేరుకున్నాయి. ఈరోజు బడ్జెట్ మీద డిప్యుటీ సీఎం భట్టి విక్రమార్క సమాధానాలు ఇస్తారు. దాంతో పాటూ నేడు సభలో కుల గణన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ అమోదం తెలపనుంది.
Also Read:Supreme Court: ఎలక్టోరల్ బాండ్లు గురించి నేడు సుప్రీం తీర్పు!
కాళేశ్వరం మీద కాగ్ నివేదిక..
నిన్నటి సమావేశాలు చాలా వాడి వేడిగా జరిగాయి. బీఆర్ఎస్ నేతలు, కేసీఆర్ మీద సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ తరుఫు నుంచి కడియం శ్రీహారి మాట్లాడారు. అయితే అధికారం పక్షం నేతలు ప్రతిపక్షం వాళ్ళని పెద్దగా మాట్లాడనివ్వలేదు. దీంతో సీఎం కేసీఆర్‌ను దూషించారు అంటూ బీఆర్ఎస్ నేతలు సభ నుంచి వాకౌట్ చేశారు. ఇవాళ కూడా సభ వాడివేడిగా జరిగే అవకాశం ఉంది. ఇవాళ ఉభయ సభల్లో కాగ్ నివేదికను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం.కాళేశ్వరం ప్రాజెక్టు పై కాగ్ రిపోర్ట్ ను సభలో పెట్టాలనుకుంటోంది కాంగ్రెస్ గవర్నమెంట్.దీంతో సభలో మళ్ళీ పెద్ద చర్చ జరుగుతుందని భావిస్తున్నారు. బీఆర్ఎస్ నేతలు కాగ్ రిపోర్ట్‌ను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈరోజు సభకైనా కేటీఆర్, కేసీఆర్ వస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఇక ఈరోజు సభలో ఇరిగేషన్, రెవిన్యూ, ఫైనాన్స్, పంచాయితీ రాజ్ రిపోర్ట్ లను టేబుల్ చేయనుంది సర్కార్. దాంతో పాటూ అసెంబ్లీలో ప్రభుత్వం పలు కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.