నాలుగో రోజూ నష్టాల్లోనే దేశీయ మార్కెట్లు By Manogna alamuru 22 Sep 2023 in బిజినెస్ నేషనల్ New Update షేర్ చేయండి దేశీయ మార్కెట్లు నాలుగు రోజులుగా పడిపోతూనే ఉన్నాయి. ఉదయం ప్రారంభమైనప్పుడు లాభాలతో ఉన్నప్పటికీ కాసేపటికే డౌన్ ట్రెండ్ లోకి వచ్చేశాయి. మళ్ళీ మధ్యాహ్నం టైమ్ కి పుంజుకుని టాప్ కి వెళ్ళాయి. కానీ చివరకు అమ్మకాల ఒత్తిడితో రోజు ముగిసేసరికి నష్టాలను మూటగట్టుకున్నాయి దేశీయ మార్కెట్లు. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూలతలు ఈరోజు కూడా దేశీయ మార్కెట్ మీద ప్రభావం చూపించాయి. దాంతో పాటూ భారత్-కెనడా మధ్య పరిణామాలు కూడా మార్కెట్ ను నష్టాల్లో పడేశాయి. అయితే జేపీ మోర్గాన్ ఎమర్జింగ్ మార్కెట్ల బాండ్ ఇండెక్స్ లో భారత చేరడం అంశం మాత్రం లాభాలనే చూకూర్చిందని చెప్పొచ్చు. ఉదయం సెన్సెక్స్ 66,215.04 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65, 952.83 దగ్గర కనిష్టాన్ని 66,445.47 దగ్గర గరిష్టాన్ని చూసింది. చివరకు 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. ఇక నిఫ్టీ 19,744.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడే లో 19, 798.65 దగ్గర టాప్ కు వెళ్ళింది. తర్వాత 19,657.50 దగ్గర కనిష్టాన్ని నమోదు చేసుకుంది. రోజు ముగిసేసరికి 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది. అయితే ఈరోజు మరొక విషయం జరిగింది. దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో సూపర్ గా ఎదిగింది. రోజు మొదట్లోనే 38 పైసలు పెరిగి 82.75 స్థాయిని చేరుకుంది. చివరకు 19పైసల లాభంతో 82.93 వద్ద నిలబడింది. #india #sensex #stock-markets #nifty #down-trend #markets #rupee #dollar #lose మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి