Asian Games 2023 Updates: ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే?

ఆసియా గేమ్స్ లో మన వాళ్ళ పతకాల వేట మొదలైంది. మొదటిరోజే నాలుగు పతకాలు గెలుచుకున్నా స్వర్ణాన్ని మాత్రం సాధించలేకపోయారు. రెండో రోజు కొచ్చేసరికి ఆ కొరత కూడా తీర్చేశారు. రెండు విభాగాల్లో అమ్మాయిలు, అబ్బాయిలు పసిడి పతకాలను గెలుచుకుని జెండా ఊంఛే హమారా అంటున్నారు.

New Update
Asian Games 2023 Updates:  ఆసియా గేమ్స్ లో భారత్ పతకాల వేట.. మొత్తం ఎన్ని పతకాలంటే?

ఆసియా గేమ్స్ 2023లో భారత్ పతకాల సాధన కొనసాగుతోంది. మొదటి రోజు ఐదు, రెండో రోజు ఆరు పతకాలతో దూసుకుపోతున్నారు. గురి తప్పని మన షూటర్లు 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ లో బంగారు పతకాన్ని సాధించారు. మరోవైపు క్రికెట్ లో దుమ్ముదులిపిన భారత్ అమ్మాయిలు స్వర్ణాన్ని మెడలో వేసుకున్నారు. దీంతో పాటూ షూటింగ్ లో మరో రెండు కాంస్యాలు కూడా ఇండియా ఖాతాలో చేరాయి.

ఆసియా క్రికెట్ లో భారత్ కు తిరుగులేదని చూపించారు మన అమ్మాయిలు. ఫైనల్లో శ్రీలంకను చిత్తు చేసిన హర్మన్ సేన త్రివర్ణ పతాకాన్ని గాల్లో ఎగురేశారు. మరోవైపు పురుషుల 10 మీటర్ల శ్రీయిర్ రైఫిల్ టీమ్ ప్రపంచ రికార్డ్ ను బద్దలు కొట్టి మరీ బంగారు పతకాన్ని సాధించారు. రుద్రాంక్ష్, ఐశ్వరీ ప్రతాప్ సింగ్, దివ్యాంశ్ సింగ్ సన్వర్ కలిసి 1893.7 స్కోరు చేసి టాప్ లో ప్లేస్ ను సొంతం చేసుకున్నారు. దీంతో ఈ ఏడాది చైనా నెలకొల్పిన వరల్డ్ రికార్డను భారత షూటర్లు తిరగరాశారు. ఇక వ్యక్తిగత విభాగంలో కూడా ప్రతాప్ కాంస్యాన్ని సొంతం చేసుకున్నాడు. చైనా షూటర్ షెంగ్ ప్రపంచ రికార్డ్ స్కోర్ తో పసిడిని కొట్టేశాడు. మరోవైపు పురుషుల 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ విబాంగలో కూడా భారత్ కు కాంస్య పతక్ దక్కింది. అనీశ్ భన్వాలా, విజయ్ వీర్ సిద్ధు, ఆదర్శ సింగ్ త్రయం క్వాలిఫికేషన్లో 1718 పాయింట్లతో మూడో స్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇందులో కూడా చైనాకు స్వర్ణం, దక్షిణ కొరియాకు రజతం వచ్చాయి.

ఆసియా క్రీడల్లో భారత రోయర్లు అయిదు పతకాలు సాధించారు. మొదటి రోజు రెండు రజతాలు, క్ష కాంస్యం నెగ్గిన రోయర్లు రెండో రోజు మరో రెండు కాంస్యాలు సొంతం చేసుకున్నారు. భారత్ రోయర్లు 2018 కంటే ఈ సారి ఎక్కువ పతకాలను గెలుచుకున్నారు. కానీ బంగారాన్ని మాత్రం సాధించలేకపోయారు.

మరోవైపు స్వర్ణ పతకం లక్ష్యతో బరిలోకి దిగిన టెఉన్నిస్ జోడీ రోహన్ బోపన్న, బాంబ్రిలు నిరాశపర్చారు. రెండో రౌండ్లోనే భారత జంట ఓడిపోయింది. ఉజ్బెకిస్తాన్ చేతిలో దెబ్బతిన్నారు. కానీ రామ్ కుమార్, సాకేత్ మైనేని లు మాత్రం ఇండోనేషియా ఆటగాళ్ళపై నెగ్గి క్వార్టర్స్ కు చేరుకున్నారు. మిక్స్డ్ డబుల్స్లో బోపన్న ముందుకు వెళుతున్నాడు. బోపన్న-రుతుజ భోంస్లే జంట ఉజ్బెకిస్థాన్ జంటను ఓడించి ప్రీ క్వార్టర్స్ లోకి వెళ్ళారు. అలాగే జిమ్నాస్టిక్స్ లో ప్రణతి నాయక్ ఆల్ రౌండ్, వాల్ట్ విభాగాల్లో ఫైనల్లోకి ప్రవేశించింది. ఇక భారత బాక్సర్లు కూడా ముందుకు వెళుతున్నారు. నివాంత్ దేవ్ ప్రీక్వార్టర్ర్స్ లోకి దూసుకెళ్ళాడు. మొత్తం ఏడు పతకాలతో...పతకాల లిస్ట్ లో భారత్ ఆరో స్థానంలో ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు