పతికి పాదపూజ చేసి, విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో సందడి చేస్తూ టచ్‌లోనే ఉంటుంది. తాజాగా.. ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.