AP Floods 2023 : ఉగ్రరూపం దాల్చుతున్న గోదావరి, అలర్ట్ అయిన అధికారులు..
గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీవర్షాల కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం వద్ధ గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వరద నీరు భారీగా వచ్చి గోదావరిలో చేరడంతో గోదావరి వరద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతుంది. నిన్న మొన్నటిదాకా ఇసుక తిన్నెలతో ఎడారిని తలపించిన గోదావరి నేడు 26 అడుగుల వద్దకు చేరి జలకళతో కళకళలాడుతోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు.