అవిశ్వాస తీర్మానంపై ఎన్డీయేకి బాసటగా జగన్ పార్టీ ?
ప్రధాని మోడీ ప్రభుత్వంపై విపక్షాలు ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మాన విషయంలో ఎన్డీయేకి మద్దతుగా నిలవాలని ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేతృత్వం లోని వైఎస్సార్పీసీ యోచిస్తోంది. ఈ తీర్మానంపై పార్లమెంటులో ఓటింగ్ జరిగినప్పుడు దీనికి వ్యతిరేకంగా ఓటు వేయాలని ఈ పార్టీలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కేంద్రంలో బీజేపీతో జగన్ పార్టీ స్నేహపూర్వక సంబంధాలను కొనసాగిస్తోంది. పార్లమెంటు ఉభయ సభల్లోనూ ఎన్డీయేకు మద్దతు పలుకుతోంది. లోక్ సభలో ఈ పార్టీకి చెందిన 22 మంది, రాజ్యసభలో 9 మంది సభ్యులున్నారు. ఎప్పుడు జటిల పరిస్థితి వచ్చినా ఎన్డీయేని ఈ పార్టీ సులువుగా ఆ గండం నుంచి గట్టెక్కిస్తోంది.