మాకు భాషా భేదం లేదు.. పవన్ కు నటుడు నాజర్ కౌంటర్..!
ఇటీవల 'బ్రో' మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ తమిళ సినీ పరిశ్రమ గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ మేరకు నడిగర్ సంఘం(తమిళ సినీ ఆర్టిస్ట్స్ అసోసిషయేషన్) అధ్యక్షుడు నాజర్ స్పందించారు. తమిళ సినీ పరిశ్రమలో నటులకు పరిమితులు విధిస్తూ ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదని నాజర్ వివరించారు. పుకార్లు నమ్మవద్దని తెలిపారు. ఇతర ప్రాంతాల నటులను తమిళ సినీ పరిశ్రమ ఎప్పుడూ ప్రోత్సహిస్తూనే ఉందన్నారు.సావిత్రి, రంగారావు లాంటి గొప్ప కళాకారులకు తమిళ సినీ పరిశ్రమ ప్రోత్సాహం అందించిందని గుర్తు చేశారు.