అధికారం కోసం మణిపూర్‌లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్

ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మూడు నెలలుగా జాతి ఘర్షణలు కొనసాగుతున్నా కేంద్రప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని విపక్ష కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుబట్టారు.అధికారం కోసం బీజేపీ మణిపూర్‌ను తగులబెట్టేందుకు సిద్దమవుతోందని విమర్శించారు.అలాగే మణిపూర్‌లో హింసపై బీజేపీకి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదంటూ మండిపడ్డారు.ఇదే అంశంపై పార్లమెంటులో అవిశ్వాస తీర్మానానికీ నోటీసు ఇచ్చామని తెలిపారు.

New Update
అధికారం కోసం మణిపూర్‌లో మంటలు : BJP,RSSపై రాహుల్ ఫైర్

మణిపూర్ (Manipur) కోసం ప్రధాని మోదీ ఏం చేశారని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రశ్నించారు.బీజేపీ (BJP) భావజాలమే మణిపూర్​లో (Manipur) మంటలకు కారణమైందని ఇదంతా మోదీకి (Modi) తెలుసని వ్యాఖ్యానించారు.జాతుల మధ్య ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో విపక్ష కూటమి 'ఇండియా' ఎంపీలు (INDIA MP's) ఈనెల 29,30 తేదీల్లో పర్యటించనున్నారు. 20 మంది ఎంపీలతో కూడిన ప్రతినిధుల బృందం మణిపూర్‌లో పర్యటించి అక్కడి పరిస్థితి తెలుసుకోనుందని కాంగ్రెస్‌ నేతలు (Congress Leaders) వెల్లడించారు. గతంలోనూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపూర్‌ను సందర్శించాలని భావించినా అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదన్నారు. రాహుల్‌ గాంధీ మాత్రం మణిపూర్‌లో కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.విపక్ష కూటమి ఇండియాలో మొత్తం 26 పార్టీలు (26 Parties) ఉన్నాయి.మణిపుర్‌ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంట్‌లో ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి.ఇప్పటికే మోదీ సర్కారుపై కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగొయ్‌ (MP Gourav Gogoi) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టగా లోక్‌సభ స్పీకర్‌ (Lok Sabha Speaker) ఓంబిర్లా దానికి అనుమతి ఇచ్చారు.

మోదీ ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలకే ప్రధాని

నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని కాదని కొంతమంది ఆర్ఎస్ఎస్ (RSS) వర్గాలకు మాత్రమే పనిచేస్తున్నారంటూ రాహుల్ గాంధీ విమర్శించారు.తమ భావజాలమే మణిపూర్‌​ను ఈ దుస్థితికి తీసుకొచ్చిందన్న విషయం ప్రధాని మోదీకి తెలుసన్నారు.విపక్ష కూటమి తమ పేరును ఇండియాగా పెట్టుకుంటే మోదీ ఏకంగా దేశాన్నే అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. బీజేపీ విద్వేష దుకాణాన్ని తెరిచిన ప్రతిచోట కాంగ్రెస్ కార్యకర్తలు ప్రేమ అంగళ్లను తెరవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ-ఆర్ఎస్ఎస్ అధికారం కోసం ఏమైనా చేస్తాయి.అధికారం కోసం మణిపుర్‌నే కాదు దేశం మొత్తాన్ని మంటల్లో నెట్టేసి యావద్దేశాన్ని అమ్మేస్తారంటూ రాహుల్ ఫైర్ (Rahul Fire) అయ్యారు.దేశ ప్రజల బాధల గురించి వారు పట్టించుకోరు.దేశభక్తి ఉన్న ఎవరికైనా పౌరుల బాధలు తెలుస్తాయి.కానీ బీజేపీ-ఆర్ఎస్‌ఎస్‌​కు ఆ బాధ తెలియదన్నారు. ఎందుకంటే దేశాన్ని విభజించేందుకు వారు ఈ కుట్రకు ప్రయత్నిస్తున్నారన్నారు.ప్రస్తుతం బీజేపీ-ఆర్ఎస్ఎస్‌కు,కాంగ్రెస్‌కు మధ్య భావజాల యుద్ధం జరుగుతోందని రాహుల్ గాంధీ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

రాజ్యసభలో విపక్ష ఎంపీలు వాకౌట్

మణిపూర్ అంశంపై చర్చించాలని కోరుతూ రాజ్యసభలో(Rajya Sabha) విపక్ష ఎంపీలు వాకౌట్ (Walk out) చేశారు.అధికార,విపక్ష సభ్యుల నినాదాలతో మధ్యాహ్న భోజన విరామానికి (Lunch Break) ముందే రెండుసార్లు సభ వాయిదా పడింది.తిరిగి సమావేశమైన తర్వాత కేంద్ర సమాచార,ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ (Anurag Takore) 2023 సినిమాటోగ్రఫీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు.దీనిపై మాట్లాడేందుకు విపక్షనేత మల్లికార్జున ఖర్గేకు (Mallikarjuna Khargey) సభాపతి అనుమతి ఇచ్చారు.అయితే తాను బిల్లు గురించే కాకుండా మనసులో మాట కూడా చెబుతానని ఖర్గే మణిపూర్ అంశాన్ని ప్రస్తావించారు.దీనికి సభాపతి అనుమతించలేదు.బిల్లువరకే పరిమితం కావాలని సూచించారు. దీంతో కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అటు లోక్‌​సభలోనూ వాయిదాల పర్వమే కొనసాగింది.కేంద్రమంత్రి జైశంకర్ (Jaishankar) ప్రకటనకు కొందరు అడ్డు తగలడం ప్రభుత్వ, విపక్ష ఎంపీల మధ్య కొంత వాగ్వాదానికి దారితీసింది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు